సూరా 16 · జుజ్ 14

An-Nahl · 16:118

وَعَلَى الَّذِينَ هَادُوا حَرَّمْنَا مَا قَصَصْنَا عَلَيْكَ مِنْ قَبْلُ ۖ وَمَا ظَلَمْنَاهُمْ وَلَٰكِنْ كَانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ

మరియు మేము నీకు ప్రస్తావించిన వాటిని, ఇంతకు ముందు యూదులకు నిషేధించాము. మరియు మేము వారికి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తామే అన్యాయం చేసుకుంటూ ఉండేవారు.

తఫ్సీర్

మరియు మేము మీకు ప్రస్తావించిన వాటిని యూదులపై ప్రత్యేకించి నిషేధించాము (సూరె అన్ఆమ్ 146 వ ఆయతులో ఉన్నట్లుగా). ఈ నిషేధము ద్వారా మేము వారిపై హింసకు పాల్పడలేదు.కానీ వారే శిక్షకు కారకాలైన వాటికి పాల్పడినప్పుడు తమ స్వయంపైనే హింసకు పాల్పడ్డారు.వారి దుర్మార్గమునకు ప్రతిఫలాన్ని మేము వారికి ప్రసాధించాము. వారికి శిక్షగా వాటిని వారిపై మేము నిషేధించాము.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి