సూరా 12 · జుజ్ 13
Yusuf · 12:69
وَلَمَّا دَخَلُوا عَلَىٰ يُوسُفَ آوَىٰ إِلَيْهِ أَخَاهُ ۖ قَالَ إِنِّي أَنَا أَخُوكَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوا يَعْمَلُونَ
మరియు వారు యూసుఫ్ వద్ద ప్రవేశించగా అతను తన సోదరుణ్ణి (బెన్యామీన్ ను) తన దగ్గరికి తీసుకున్నాడు. అతనితో అన్నాడు: "వాస్తవానికి! నేనే నీ (తప్పిపోయిన) సోదరుడను, కావున వారు ఇంత వరకు చేస్తూ వచ్చిన పనులకు నీవు దుఃఖపడకు."
తఫ్సీర్
మరియు ఎప్పుడైతే యూసుఫ్ అలైహిస్సలాం సోదరులు యూసుఫ్ అలైహిస్సలాం వద్దకు వచ్చారో వారితోపాటు అతని సొంత సోదరుడు కూడా ఉన్నాడు.ఆయన తన సొంత సోదరుడును తనకు హత్తుకున్నారు.మరియు అతనితో నిశ్చయంగా నేను నీ సొంత సోదరుడిని అని రహస్యంగా చెప్పారు. అయితే నీవు నీ సోదరులు మనల్ని బాధ కలిగించే,ద్వేషించే మరియు వారు నన్ను బావిలో పడవేసే బుద్దిహీన కార్యాలకు పాల్పడుతున్నారని బాధపడకు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి