సూరా 12 · జుజ్ 13
Yusuf · 12:68
وَلَمَّا دَخَلُوا مِنْ حَيْثُ أَمَرَهُمْ أَبُوهُمْ مَا كَانَ يُغْنِي عَنْهُمْ مِنَ اللَّهِ مِنْ شَيْءٍ إِلَّا حَاجَةً فِي نَفْسِ يَعْقُوبَ قَضَاهَا ۚ وَإِنَّهُ لَذُو عِلْمٍ لِمَا عَلَّمْنَاهُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
మరియు వారు తమ తండ్రి ఆజ్ఞ ప్రకారం (ఆ నగరంలో వేర్వేరు ద్వారాల గుండా) ప్రవేశించారు. అది కేవలం యఅఖూబ్ మనస్సులోని కోరికను పూర్తి చేయటానికి మాత్రమే, కాని అల్లాహ్ సంకల్పం నుండి తప్పించుకోవటానికి, వారికి ఏ మాత్రమూ పనికి రాలేదు. మేము అతనికి నేర్పిన జ్ఞానం ప్రకారం అతను జ్ఞానవంతుడే కాని చాలా మందికి తెలియదు.
తఫ్సీర్
అయితే వారందరు తమతో అతని సొంత సోదరుడిని తీసుకుని బయలదేరారు. మరియు అప్పుడు వారు వారి తండ్రి వారిని ఆదేశించిన విధంగా వేరు వేరు ద్వారముల నుండి ప్రవేశించారు.వేరు వేరు ద్వారముల నుండి వారి ప్రవేశము వారిపై అల్లాహ్ నిర్ణయించిన దాని నుండి దేనినీ వారి నుండి దూరం చేయలేదు.అది తన సంతానము పై యాఖూబ్ అలైహిస్సలాం యొక్క దయ దానిని ఆయన వ్యక్తపరచారు మరియు దానితో వారికి ఆయన ఉపదేశం చేశారు.మరియు అల్లాహ్ నిర్ణయం తప్ప వేరే నిర్ణయం లేదని ఆయనకు తెలుసు.మరియు మేము ఆయనకు నేర్పిన విధిపై విశ్వాసం,మార్గాలను ఎంచుకోవటం ద్వారా ఆయనకు తెలుసు.కాని చాలా మందికి అది తెలియదు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి