సూరా 12 · జుజ్ 12
Yusuf · 12:5
قَالَ يَا بُنَيَّ لَا تَقْصُصْ رُؤْيَاكَ عَلَىٰ إِخْوَتِكَ فَيَكِيدُوا لَكَ كَيْدًا ۖ إِنَّ الشَّيْطَانَ لِلْإِنْسَانِ عَدُوٌّ مُبِينٌ
(అతని తండ్రి) అన్నాడు: "ఓ నా చిన్న ప్రియకుమారుడా! నీ స్వప్నాన్ని నీ సోదరులకు తెలుపకు. ఎందుకంటే వారు నీకు విరుద్ధంగా కుట్ర పన్నవచ్చు! నిశ్చయంగా, షైతాన్ మానవునికి బహిరంగ శత్రువు.
తఫ్సీర్
యాఖూబ్ తన కుమారుడగు యూసుఫ్ తో ఇలా పలికారు : ఓ నా ప్రియ కుమారా నీవు నీ కలను నీ సోదరులకు తెలియపరచకు అప్పుడు వారు దాన్ని అర్ధం చేసుకుంటారు. మరియు వారు నీ పై అసూయ చెందుతారు.అప్పుడు వారు తమ అసూయతో నీ కొరకు కుట్రలు పన్నుతారు . నిశ్చయంగా షైతాను మానవుని కొరకు స్పష్టమైన శతృవు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి