సూరా 12 · జుజ్ 12

Yusuf · 12:4

إِذْ قَالَ يُوسُفُ لِأَبِيهِ يَا أَبَتِ إِنِّي رَأَيْتُ أَحَدَ عَشَرَ كَوْكَبًا وَالشَّمْسَ وَالْقَمَرَ رَأَيْتُهُمْ لِي سَاجِدِينَ

(జ్ఞాపకం చేసుకోండి) యూసుఫ్ తన తండ్రితో: "ఓ నాన్నా! నేను వాస్తవంగా (కలలో) పదకొండు నక్షత్రాలను, సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి చూశాను; వాటిని నా ముందు సాష్టాంగ పడుతున్నట్లు చూశాను." అని అన్నప్పుడు!

తఫ్సీర్

ఓ ప్రవక్తా మేము మీకు యూసుఫ్ తన తండ్రి యాకూబ్ తో ఇలా పలికిన వేళను తెలియపరుస్తున్నాము : ఓ నా ప్రియ తండ్రి నిశ్చయంగా నేను కలలో పదకొండు నక్షత్రాలను చూశాను మరియు నేను సూర్యుడిని,చంద్రుడిని చూశాను.నేను వాటన్నింటిని నాకు సాష్టాంగ పడుతున్నట్లు చూశాను.అయితే ఈ కల యుసుఫ్ అలైహిస్సలాము కొరకు తొందరగా ఇవ్వబడిన శుభవార్త అయినది.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి