Ad-Duha

سورة الضحى

సూరా 93 · మక్కీ · 11 ఆయత్‌లు

93:1జుజ్ 30 · పు. 596

وَالضُّحَىٰ1

ప్రకాశవంతమైన ప్రొద్దుటి పూట (పూర్వాహ్ణం) సాక్షిగా!
93:2జుజ్ 30 · పు. 596

وَاللَّيْلِ إِذَا سَجَىٰ2

మరియు చీకటి పడ్డ రాత్రి సాక్షిగా!
93:3జుజ్ 30 · పు. 596

مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ3

(ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు.
93:4జుజ్ 30 · పు. 596

وَلَلْآخِرَةُ خَيْرٌ لَكَ مِنَ الْأُولَىٰ4

మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది!

وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ5

మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు.
93:6జుజ్ 30 · పు. 596

أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ6

(ఓ ముహమ్మద్!) ఏమీ? నిన్ను అనాథునిగా చూసి, ఆయన (అల్లాహ్) నీకు ఆశ్రయం కల్పించలేదా?
93:7జుజ్ 30 · పు. 596

وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ7

మరియు నీకు మార్గం తోచనప్పుడు, ఆయన నీకు మార్గదర్శకత్వం చేయలేదా?
93:8జుజ్ 30 · పు. 596

وَوَجَدَكَ عَائِلًا فَأَغْنَىٰ8

మరియు ఆయన, పేదవానిగా చూసి, నిన్ను సంపన్నుడిగా చేయలేదా?
93:9జుజ్ 30 · పు. 596

فَأَمَّا الْيَتِيمَ فَلَا تَقْهَرْ9

కాబట్టి నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు;
93:10జుజ్ 30 · పు. 596

وَأَمَّا السَّائِلَ فَلَا تَنْهَرْ10

మరియు యాచకుణ్ణి కసరుకోకు;
93:11జుజ్ 30 · పు. 596

وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ11

మరియు నీ ప్రభువు అనుగ్రహాలను బహిరంగంగా ప్రకటిస్తూ ఉండు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి