وَاللَّيْلِ إِذَا يَغْشَىٰ1
Al-Layl
سورة الليل
సూరా 92 · మక్కీ · 21 ఆయత్లు
92:1జుజ్ 30 · పు. 595
క్రమ్ముకునే రాత్రి సాక్షిగా!
92:2జుజ్ 30 · పు. 595
وَالنَّهَارِ إِذَا تَجَلَّىٰ2
ప్రకాశించే పగటి సాక్షిగా!
92:3జుజ్ 30 · పు. 595
وَمَا خَلَقَ الذَّكَرَ وَالْأُنْثَىٰ3
మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా!
92:4జుజ్ 30 · పు. 595
إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ4
వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి;
92:5జుజ్ 30 · పు. 595
فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ5
కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో!
92:6జుజ్ 30 · పు. 595
وَصَدَّقَ بِالْحُسْنَىٰ6
మరియు మంచిని నమ్ముతాడో!
92:7జుజ్ 30 · పు. 595
فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ7
అతనికి మేము మేలు కొరకు దానిరి సులభం చేస్తాము.
92:8జుజ్ 30 · పు. 595
وَأَمَّا مَنْ بَخِلَ وَاسْتَغْنَىٰ8
కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో!
92:9జుజ్ 30 · పు. 595
وَكَذَّبَ بِالْحُسْنَىٰ9
మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో!
92:10జుజ్ 30 · పు. 596
فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ10
అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము.
92:11జుజ్ 30 · పు. 596
وَمَا يُغْنِي عَنْهُ مَالُهُ إِذَا تَرَدَّىٰ11
మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది?
92:12జుజ్ 30 · పు. 596
إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ12
నిశ్చయంగా, సన్మార్గం చూపడం మా పని!
92:13జుజ్ 30 · పు. 596
وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ13
మరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది.
92:14జుజ్ 30 · పు. 596
فَأَنْذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ14
కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను.
92:15జుజ్ 30 · పు. 596
لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى15
పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు!
92:16జుజ్ 30 · పు. 596
الَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ16
ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో!
92:17జుజ్ 30 · పు. 596
وَسَيُجَنَّبُهَا الْأَتْقَى17
కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు!
92:18జుజ్ 30 · పు. 596
الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّىٰ18
అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో!
92:19జుజ్ 30 · పు. 596
وَمَا لِأَحَدٍ عِنْدَهُ مِنْ نِعْمَةٍ تُجْزَىٰ19
కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక;
92:20జుజ్ 30 · పు. 596
إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَىٰ20
కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే!
92:21జుజ్ 30 · పు. 596
وَلَسَوْفَ يَرْضَىٰ21
మరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు.