Al-Haqqah

سورة الحاقة

సూరా 69 · మక్కీ · 52 ఆయత్‌లు

69:1జుజ్ 29 · పు. 566

الْحَاقَّةُ1

ఆ అనివార్య సంఘటన (పునరుత్థానం)!
69:2జుజ్ 29 · పు. 566

مَا الْحَاقَّةُ2

ఏమిటా అనివార్య సంఘటన?
69:3జుజ్ 29 · పు. 566

وَمَا أَدْرَاكَ مَا الْحَاقَّةُ3

మరియు ఆ అనివార్య సంఘటన, అంటే ఏమిటో నీకేమి తెలుసు?
69:4జుజ్ 29 · పు. 566

كَذَّبَتْ ثَمُودُ وَعَادٌ بِالْقَارِعَةِ4

సమూద్ మరియు ఆద్ జాతి వారు అకస్మాత్తుగా విరుచుకుపడే ఆ ఉపద్రవాన్ని అసత్యమని తిరస్కరించారు.
69:5జుజ్ 29 · పు. 566

فَأَمَّا ثَمُودُ فَأُهْلِكُوا بِالطَّاغِيَةِ5

కావున సమూద్ జాతి వారైతే ఒక భయంకరమైన గర్జన ద్వారా నాశనం చేయబడ్డారు.
69:6జుజ్ 29 · పు. 566

وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ6

మరియు ఆద్ జాతి వారేమో అతి తీవ్రమైన తుఫాను గాలి ద్వారా నాశనం చేయబడ్డారు.
69:7జుజ్ 29 · పు. 566

سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ7

ఆయన (అల్లాహ్), దానిని వారి మీద ఏడు రాత్రులు మరియు ఎనిమిది పగళ్ళ వరకు ఎడతెగకుండా ఆవరింపజేశాడు. దాని వలన వారు వేళ్ళతో పెళ్ళగించబడిన ఖర్జూరపు బోదెల వలే పాడై పోవటం, నీవు చూస్తావు!
69:8జుజ్ 29 · పు. 566

فَهَلْ تَرَىٰ لَهُمْ مِنْ بَاقِيَةٍ8

అయితే ఇప్పుడు వారిలో ఎవరైనా మిగిలి ఉన్నట్లు నీవు చూస్తున్నావా?
69:9జుజ్ 29 · పు. 567

وَجَاءَ فِرْعَوْنُ وَمَنْ قَبْلَهُ وَالْمُؤْتَفِكَاتُ بِالْخَاطِئَةِ9

ఫిర్ఔన్ మరియు అతనికి పూర్వం గతించిన వారూ మరియు తలక్రిందులు చేయబడిన నగరాల వారూ, అందరూ గొప్ప నేరాలకు పాల్పడినవారే.
69:10జుజ్ 29 · పు. 567

فَعَصَوْا رَسُولَ رَبِّهِمْ فَأَخَذَهُمْ أَخْذَةً رَابِيَةً10

మరియు వారు తమ ప్రభువు పంపిన ప్రవక్తలకు అవిధేయత కనబరచారు, కావున ఆయన వారిని కఠినమైన పట్టుతో పట్టుకున్నాడు.
69:11జుజ్ 29 · పు. 567

إِنَّا لَمَّا طَغَى الْمَاءُ حَمَلْنَاكُمْ فِي الْجَارِيَةِ11

నిశ్చయంగా, ఎప్పుడైతే (నూహ్ తుఫాన్) నీరు హద్దు లేకుండా ఉప్పొంగి పోయిందో! అప్పుడు మేము, మిమ్మల్ని పయనించే (నావలో) ఎక్కించాము.
69:12జుజ్ 29 · పు. 567

لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةً وَتَعِيَهَا أُذُنٌ وَاعِيَةٌ12

దానిని, మీకొక హితబోధగానూ మరియు జ్ఞాపకముంచుకోగల చెవి, దానిని జ్ఞాపకం ఉంచుకోవటానికి అనువైనదిగా చేశాము.
69:13జుజ్ 29 · పు. 567

فَإِذَا نُفِخَ فِي الصُّورِ نَفْخَةٌ وَاحِدَةٌ13

ఇక ఎప్పుడైతే ఒక పెద్ద ధ్వనితో బాకా ఊదబడుతుందో!
69:14జుజ్ 29 · పు. 567

وَحُمِلَتِ الْأَرْضُ وَالْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَاحِدَةً14

మరియు భూమి మరియు పర్వతాలు పైకి ఎత్తబడి ఒక పెద్ద దెబ్బతో తుత్తునియలుగా చేయబడతాయో!
69:15జుజ్ 29 · పు. 567

فَيَوْمَئِذٍ وَقَعَتِ الْوَاقِعَةُ15

అప్పుడు, ఆ రోజున సంభవించవలసిన ఆ అనివార్య సంఘటన సంభవిస్తుంది.
69:16జుజ్ 29 · పు. 567

وَانْشَقَّتِ السَّمَاءُ فَهِيَ يَوْمَئِذٍ وَاهِيَةٌ16

మరియు ఆ రోజున ఆకాశం బ్రద్దలై పోతుంది మరియు దాని వ్యవస్థ సడలి పోతుంది.
69:17జుజ్ 29 · పు. 567

وَالْمَلَكُ عَلَىٰ أَرْجَائِهَا ۚ وَيَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ يَوْمَئِذٍ ثَمَانِيَةٌ17

మరియు దేవదూతలు దాని (అర్ష్) ప్రక్కలలో ఉంటారు. మరియు నీ ప్రభువు యొక్క సింహాసనాన్ని (అర్ష్ ను), ఆ రోజు ఎనిమిది మంది (దేవదూతలు) ఎత్తుకొని ఉంటారు.
69:18జుజ్ 29 · పు. 567

يَوْمَئِذٍ تُعْرَضُونَ لَا تَخْفَىٰ مِنْكُمْ خَافِيَةٌ18

ఆ రోజు మీరు (తీర్పు కొరకు) హాజరు చేయబడతారు. మీరు దాచిన ఏ రహస్యం కూడా (ఆ రోజు) దాగి ఉండదు.
69:19జుజ్ 29 · పు. 567

فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَيَقُولُ هَاؤُمُ اقْرَءُوا كِتَابِيَهْ19

ఇక ఎవనికైతే తన కర్మపత్రము కుడి చేతిలో ఇవ్వబడుతుందో, అతడు ఇలా అంటాడు: "ఇదిగో నా కర్మపత్రాన్ని తీసుకొని చదవండి!
69:20జుజ్ 29 · పు. 567

إِنِّي ظَنَنْتُ أَنِّي مُلَاقٍ حِسَابِيَهْ20

నిశ్చయంగా, నా లెక్క నాకు తప్పకుండా లభిస్తుందని నేను భావించేవాడిని!"
69:21జుజ్ 29 · పు. 567

فَهُوَ فِي عِيشَةٍ رَاضِيَةٍ21

కావున, అతడు సంతోషకరమైన జీవితం గడుపుతాడు.
69:22జుజ్ 29 · పు. 567

فِي جَنَّةٍ عَالِيَةٍ22

అత్యున్నతమైన స్వర్గవనంలో.
69:23జుజ్ 29 · పు. 567

قُطُوفُهَا دَانِيَةٌ23

దాని పండ్లగుత్తులు, సమీపంలో వ్రేలాడుతూ ఉంటాయి.
69:24జుజ్ 29 · పు. 567

كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ24

(వారితో ఇలా అనబడుతుంది): "గడిచి పోయిన దినాలలో మీరు చేసి పంపిన కర్మలకు ప్రతిఫలంగా, ఇప్పుడు మీరు హాయిగా తినండి మరియు త్రాగండి!"
69:25జుజ్ 29 · పు. 567

وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِشِمَالِهِ فَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُوتَ كِتَابِيَهْ25

ఇక ఎవడికైతే, తన కర్మపత్రం ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, అతడు ఇలా వాపోతాడు: "అయ్యో! నా పాడుగాను! నా కర్మపత్రం అసలు నాకు ఇవ్వబడకుండా ఉంటే ఎంత బాగుండేది!
69:26జుజ్ 29 · పు. 567

وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ26

మరియు నా లెక్క ఏమిటో నాకు తెలియకుంటే ఎంత బాగండేది!
69:27జుజ్ 29 · పు. 567

يَا لَيْتَهَا كَانَتِ الْقَاضِيَةَ27

అయ్యో! నా పాడుగాను! అది (ఆ మరణమే) నాకు అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది!
69:28జుజ్ 29 · పు. 567

مَا أَغْنَىٰ عَنِّي مَالِيَهْ ۜ28

నా సంపద నాకేమీ పనికి రాలేదు;
69:29జుజ్ 29 · పు. 567

هَلَكَ عَنِّي سُلْطَانِيَهْ29

నా అధికారమంతా అంతమై పోయింది!"
69:30జుజ్ 29 · పు. 567

خُذُوهُ فَغُلُّوهُ30

(అప్పుడు ఇలా ఆజ్ఞ ఇవ్వబడుతుంది): "అతన్ని పట్టుకోండి మరియు అతని మెడలో సంకెళ్ళు వేయండి;
69:31జుజ్ 29 · పు. 567

ثُمَّ الْجَحِيمَ صَلُّوهُ31

తరువాత అతనిని భగభగమండే నరకాగ్నిలో వేయండి.
69:32జుజ్ 29 · పు. 567

ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ32

ఆ తరువాత అతనిని డెబ్భై మూరల పొడవు గల గొలుసుతో బంధించండి!"
69:33జుజ్ 29 · పు. 567

إِنَّهُ كَانَ لَا يُؤْمِنُ بِاللَّهِ الْعَظِيمِ33

వాస్తవానికి అతడు సర్వోత్తముడైన అల్లాహ్ ను విశ్వసించేవాడు కాదు.
69:34జుజ్ 29 · పు. 567

وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ34

మరియు నిరుపేదలకు ఆహారం పెట్టమని ప్రోత్సహించేవాడు కాదు.
69:35జుజ్ 29 · పు. 567

فَلَيْسَ لَهُ الْيَوْمَ هَاهُنَا حَمِيمٌ35

కావున, ఈనాడు అతనికి ఇక్కడ ఏ స్నేహితుడూ లేడు;
69:36జుజ్ 29 · పు. 568

وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ36

మరియు అసహ్యకరమైన గాయాల కడుగు తప్ప, మరొక ఆహారమూ లేదు!
69:37జుజ్ 29 · పు. 568

لَا يَأْكُلُهُ إِلَّا الْخَاطِئُونَ37

దానిని పాపులు తప్ప మరెవ్వరూ తినరు!
69:38జుజ్ 29 · పు. 568

فَلَا أُقْسِمُ بِمَا تُبْصِرُونَ38

కావున, నేను మీరు చూడగలిగే వాటి శపథం చేస్తున్నాను;
69:39జుజ్ 29 · పు. 568

وَمَا لَا تُبْصِرُونَ39

మరియు మీరు చూడలేనట్టని వాటి (శపథం) కూడా!
69:40జుజ్ 29 · పు. 568

إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ40

నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుని (పై అవతరింప జేయబడిన) వాక్కు.
69:41జుజ్ 29 · పు. 568

وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَا تُؤْمِنُونَ41

మరియు ఇది ఒక కవి యొక్క వాక్కు కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ.
69:42జుజ్ 29 · పు. 568

وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَا تَذَكَّرُونَ42

మరియు ఇది ఏ జ్యాతిష్యుని వాక్కు కూడా కాదు! మీరు గ్రహించేది చాలా తక్కువ.
69:43జుజ్ 29 · పు. 568

تَنْزِيلٌ مِنْ رَبِّ الْعَالَمِينَ43

ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరించింది.
69:44జుజ్ 29 · పు. 568

وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ الْأَقَاوِيلِ44

ఒకవేళ ఇతను (ఈ ప్రవక్త), మా (అల్లాహ్ ను) గురించి ఏదైనా అబద్ధపు మాట కల్పించి ఉంటే!
69:45జుజ్ 29 · పు. 568

لَأَخَذْنَا مِنْهُ بِالْيَمِينِ45

మేము అతని కుడి చేతిని పట్టుకునే వారం.
69:46జుజ్ 29 · పు. 568

ثُمَّ لَقَطَعْنَا مِنْهُ الْوَتِينَ46

తరువాత అతని (మెడ) రక్తనాళాన్ని కోసేవారం.
69:47జుజ్ 29 · పు. 568

فَمَا مِنْكُمْ مِنْ أَحَدٍ عَنْهُ حَاجِزِينَ47

అప్పుడు మీలో నుండి ఏ ఒక్కడు కూడా అతనిని (మా శిక్ష నుండి) కాపాడ లేక పోయేవాడు.
69:48జుజ్ 29 · పు. 568

وَإِنَّهُ لَتَذْكِرَةٌ لِلْمُتَّقِينَ48

మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) దైవభీతి గల వారికొక హితోపదేశం.
69:49జుజ్ 29 · పు. 568

وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنْكُمْ مُكَذِّبِينَ49

మరియు నిశ్చయంగా మీలో కొందరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని అనేవారు ఉన్నారని మాకు బాగా తెలుసు.
69:50జుజ్ 29 · పు. 568

وَإِنَّهُ لَحَسْرَةٌ عَلَى الْكَافِرِينَ50

మరియు నిశ్చయంగా, ఇది (ఈ తిరస్కారం) సత్యతిరస్కారులకు దుఃఖ కారణమవుతుంది.
69:51జుజ్ 29 · పు. 568

وَإِنَّهُ لَحَقُّ الْيَقِينِ51

మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) నమ్మదగిన సత్యం.
69:52జుజ్ 29 · పు. 568

فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ52

కావున నీవు సర్వోత్తముడైన నీ ప్రభువు పవిత్ర నామాన్ని స్తుతించు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి