ن ۚ وَالْقَلَمِ وَمَا يَسْطُرُونَ 1
నూన్, కలం సాక్షిగా! మరియు వారు (దేవదూతలు) వ్రాస్తున్న దాని సాక్షిగా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا أَنْتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ 2
నీ ప్రభువు అనుగ్రహం వలన నీవు (ఓ ముహమ్మద్) పిచ్చివాడవు కావు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ 3
మరియు నిశ్చయంగా, నీకు ఎన్నటికీ తరిగిపోని ప్రతిఫలం ఉంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ 4
మరియు నిశ్చయంగా, నీవు ఉత్తమమైన శీలవంతుడవు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ 5
కావున త్వరలోనే నీవు చూడగలవు మరియు వారు కూడా చూడగలరు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ بِأَيْيِكُمُ الْمَفْتُونُ 6
మీలో ఎవరికి పిచ్చి ఉందో!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ 7
నిశ్చయంగా, నీ ప్రభువు! ఆయనకు ఎవడు మార్గభ్రష్టుడయ్యాడో తెలుసు మరియు ఎవడు సన్మార్గం మీద ఉన్నాడో కూడా ఆయనకు బాగా తెలుసు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَلَا تُطِعِ الْمُكَذِّبِينَ 8
కావున నీవు ఈ అసత్యవాదులను అనుసరించకు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَدُّوا لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ 9
ఒకవేళ నీవు (ధర్మం విషయంలో) మెత్తపడితే వారు కూడా మెత్తపడ కోరుతున్నారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَهِينٍ 10
కావున నీవు ప్రమాణాలు చేసే ప్రతి నీచుడిని అనుసరించకు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ هَمَّازٍ مَشَّاءٍ بِنَمِيمٍ 11
చాడీలు చెప్పేవాడిని, ఎత్తి పొడుస్తూ ఉండేవాడిని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَنَّاعٍ لِلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ 12
మంచిని నిరోధించేవాడిని, హద్దు మీరి ప్రవర్తించే పాపిష్ఠుడిని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ عُتُلٍّ بَعْدَ ذَٰلِكَ زَنِيمٍ 13
నిర్ధయుడిని, ఇంతే గాకుండా అపఖ్యాతి గల (నిందార్హుడైన) వాడిని;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَنْ كَانَ ذَا مَالٍ وَبَنِينَ 14
వాడు ధనవంతుడూ మరియు సంతాన భాగ్యంతో తలతూగుతూ ఉన్నవాడు అయినా సరే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ 15
ఒకవేళ వాడికి మా సూచనలు (ఆయాత్) వినిపిస్తే, అందుకు వాడు: "ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ سَنَسِمُهُ عَلَى الْخُرْطُومِ 16
మేము త్వరలోనే వాడి ముక్కు మీద వాత పెడ్తాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّا بَلَوْنَاهُمْ كَمَا بَلَوْنَا أَصْحَابَ الْجَنَّةِ إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ 17
నిశ్చయంగా, మేము ఆ తోటవారిని పరీక్షించినట్లుగా వీరిని కూడా పరీక్షిస్తాము. ఎవరైతే తెల్లవారగానే తప్పక దాని పంట కోసుకుందామని ప్రతిజ్ఞ చేసుకున్నారో!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَا يَسْتَثْنُونَ 18
మరియు (అల్లాహ్ కోరితే) అనే, మినహాయింపుకు తావు ఇవ్వకుండా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَطَافَ عَلَيْهَا طَائِفٌ مِنْ رَبِّكَ وَهُمْ نَائِمُونَ 19
కావున వారు పడుకొని ఉండగానే నీ ప్రభువు తరఫు నుండి దానిపై (ఆ తోటపై) ఒక ఆపద వచ్చి పడింది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَصْبَحَتْ كَالصَّرِيمِ 20
దాంతో తెల్లవారే సరికి అది (ఆ తోట) పంట కోసిన పొలం వలే మారి పోయింది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَتَنَادَوْا مُصْبِحِينَ 21
తరువాత ఉదయం లేచి వారు ఒకరితో నొకరు ఇలా చెప్పుకోసాగారు:
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَنِ اغْدُوا عَلَىٰ حَرْثِكُمْ إِنْ كُنْتُمْ صَارِمِينَ 22
"మీరు పంటను కోయదలుచుకుంటే ఉదయమే మీ పొలానికి వెళ్ళండి."
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَانْطَلَقُوا وَهُمْ يَتَخَافَتُونَ 23
ఆ తరువాత వారు ఒకరితోనొకరు (ఈ విధంగా) మెల్లగా చెప్పుకుంటూ బయలు దేరారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَنْ لَا يَدْخُلَنَّهَا الْيَوْمَ عَلَيْكُمْ مِسْكِينٌ 24
"ఈ రోజు ఏ పేదవాడిని కూడా మీ దగ్గరకు రానివ్వకండి!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَغَدَوْا عَلَىٰ حَرْدٍ قَادِرِينَ 25
మరియు వారు (పేదవారిని) దగ్గరకు రానివ్వకూడదని గట్టి నిర్ణయంతో తెల్లవారు ఝామున బయలు దేరారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَلَمَّا رَأَوْهَا قَالُوا إِنَّا لَضَالُّونَ 26
వారు దానిని (తోటను) చూసి ఇలా వాపోయారు: "నిశ్చయంగా, మనం దారి తప్పాము!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ بَلْ نَحْنُ مَحْرُومُونَ 27
కాదు! కాదు! మనం సర్వం కోల్పోయాము!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالَ أَوْسَطُهُمْ أَلَمْ أَقُلْ لَكُمْ لَوْلَا تُسَبِّحُونَ 28
వారిలో మధ్యరకానికి చెందినవాడు ఇలా అన్నాడు: "ఏమీ? నేను మీతో అనలేదా? మీరు ఎందుకు ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడరని ('ఇన్ షా అల్లాహ్!' అనరని)?"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا سُبْحَانَ رَبِّنَا إِنَّا كُنَّا ظَالِمِينَ 29
వారు ఇలా అన్నారు: "మా ప్రభువు సర్వలోపాలకూ అతీతుడు! నిశ్చయంగా, మేమే దుర్మార్గులము!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَلَاوَمُونَ 30
తరువాత వారు అభిముఖులై ఒకరి నొకరు నిందించుకోసాగారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قَالُوا يَا وَيْلَنَا إِنَّا كُنَّا طَاغِينَ 31
వారు ఇలా వాపోయారు: "అయ్యో! మా పాడుగాను! నిశ్చయంగా, మేము తలబిరుసుతనం చూపాము!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ عَسَىٰ رَبُّنَا أَنْ يُبْدِلَنَا خَيْرًا مِنْهَا إِنَّا إِلَىٰ رَبِّنَا رَاغِبُونَ 32
బహశా! మన ప్రభువు మనకు దీనికి బదులుగా దీని కంటే శ్రేష్ఠమైన దానిని ప్రసాదించ వచ్చు! నిశ్చయంగా, మనం మన ప్రభువు వైపునకు (పశ్చాత్తాపంతో) మరలుదాము!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَذَٰلِكَ الْعَذَابُ ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ 33
ఈ విధంగా ఉంటుంది శిక్ష! మరియు పరలోక శిక్ష దీని కంటే ఘోరంగా ఉంటుంది. వారు ఇది తెలుసుకుంటే ఎంత బాగుండేది!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ لِلْمُتَّقِينَ عِنْدَ رَبِّهِمْ جَنَّاتِ النَّعِيمِ 34
నిశ్చయంగా, దైవభీతి గలవారికి వారి ప్రభువు వద్ద పరమానందకరమైన స్వర్గవనాలు ఉంటాయి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَفَنَجْعَلُ الْمُسْلِمِينَ كَالْمُجْرِمِينَ 35
ఏమీ? మేము విధేయులను (ముస్లింలను) నేరస్థులతో సమానంగా ఎంచుదుమా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ 36
మీకేమయింది? మీరు ఏ విధమైన నిర్ణయాలు చేస్తున్నారు?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَمْ لَكُمْ كِتَابٌ فِيهِ تَدْرُسُونَ 37
మీ వద్ద ఏదయినా (దివ్య) గ్రంథముందా? దాని నుండి మీరు నేర్చుకోవటానికి!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ 38
నిశ్చయంగా, అందులో మీకు, మీరు కోరేదంతా ఉందని?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَمْ لَكُمْ أَيْمَانٌ عَلَيْنَا بَالِغَةٌ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۙ إِنَّ لَكُمْ لَمَا تَحْكُمُونَ 39
లేక, పునరుత్థాన దినం వరకు, మీరు నిర్ణయించుకున్నదే మీకు తప్పక లభిస్తుందని, మేము మీతో చేసిన గట్టి ప్రమాణం ఏదైనా ఉందా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ سَلْهُمْ أَيُّهُمْ بِذَٰلِكَ زَعِيمٌ 40
వారిలో దీనికి ఎవడు హామీగా ఉన్నాడో అడుగు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَمْ لَهُمْ شُرَكَاءُ فَلْيَأْتُوا بِشُرَكَائِهِمْ إِنْ كَانُوا صَادِقِينَ 41
లేక, వారికి ఎవరైనా (వారు అల్లాహ్ కు కల్పించిన) భాగస్వాములు ఉన్నారా? ఒకవేళ వారు సత్యవంతులే అయితే తమ ఆ భాగస్వాములను తీసుకు రమ్మను.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَوْمَ يُكْشَفُ عَنْ سَاقٍ وَيُدْعَوْنَ إِلَى السُّجُودِ فَلَا يَسْتَطِيعُونَ 42
(జ్ఞాపకముంచుకోండి) ఏ రోజయితే పిక్క ఎముక తెరిచి వేయబడుతుందో! మరియు వారు సాష్టాంగం (సజ్దా) చేయటానికి పిలువబడతారో, అప్పుడు వారు (కపట విశ్వాసులు), అలా (సజ్దా) చేయలేరు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۖ وَقَدْ كَانُوا يُدْعَوْنَ إِلَى السُّجُودِ وَهُمْ سَالِمُونَ 43
వారి చూపులు క్రిందికి వాలిపోయి ఉంటాయి, అవమానం వారిని ఆవరించి ఉంటుంది. మరియు వాస్తవానికి వారు నిక్షేపంగా ఉన్నప్పుడు సాష్టాంగం (సజ్దా) చేయటానికి ఆహ్వానించబడితే (తిరస్కరించేవారు)!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَذَرْنِي وَمَنْ يُكَذِّبُ بِهَٰذَا الْحَدِيثِ ۖ سَنَسْتَدْرِجُهُمْ مِنْ حَيْثُ لَا يَعْلَمُونَ 44
కావున నన్ను మరియు ఈ సందేశాన్ని అబద్ధమని తిరస్కరించే వారిని వదలండి. వారు గ్రహించని విధంగా మేము వారిని క్రమక్రమంగా (వినాశం వైపునకు) తీసుకొని పోతాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأُمْلِي لَهُمْ ۚ إِنَّ كَيْدِي مَتِينٌ 45
మరియు నేను వారికి కొంత వ్యవధి నిస్తున్నాను. నిశ్చయంగా, నా పన్నాగం చాలా దృఢమైనది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَمْ تَسْأَلُهُمْ أَجْرًا فَهُمْ مِنْ مَغْرَمٍ مُثْقَلُونَ 46
లేక, (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఏదైనా ప్రతిఫలం ఇవ్వమని అడుగుతున్నావా? వారికి దాని రుణం భారమవటానికి?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ أَمْ عِنْدَهُمُ الْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ 47
లేక, వారి వద్ద ఏదైనా అగోచర జ్ఞానం ఉందా? వారు దానిని వ్రాసి పెట్టడానికి?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُنْ كَصَاحِبِ الْحُوتِ إِذْ نَادَىٰ وَهُوَ مَكْظُومٌ 48
కావున నీవు నీ ప్రభువు ఆజ్ఞ కొరకు వేచి ఉండు. మరియు నీవు, చేపవాని (యూనుస్) వలే వ్యవహరించకు. (గుర్తుకు తెచ్చుకో) అతను దుఃఖంలో ఉన్నప్పుడు (తన ప్రభువును) మొర పెట్టుకున్నాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَوْلَا أَنْ تَدَارَكَهُ نِعْمَةٌ مِنْ رَبِّهِ لَنُبِذَ بِالْعَرَاءِ وَهُوَ مَذْمُومٌ 49
అతని ప్రభువు అనుగ్రహమే గనక అతనికి అందక పోయి ఉంటే, అతను అవమానకరమైన స్థితిలో (చేప కడుపులో పడి ఉండేవాడు కాని మేము అతనిని క్షమించాము). కావున అతను చౌట (బంజరు) మైదానంలో విసరి వేయ బడ్డాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَاجْتَبَاهُ رَبُّهُ فَجَعَلَهُ مِنَ الصَّالِحِينَ 50
చివరకు అతని ప్రభువు అతనిని ఎన్నుకొని సత్పురుషులలో చేర్చాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنْ يَكَادُ الَّذِينَ كَفَرُوا لَيُزْلِقُونَكَ بِأَبْصَارِهِمْ لَمَّا سَمِعُوا الذِّكْرَ وَيَقُولُونَ إِنَّهُ لَمَجْنُونٌ 51
మరియు ఆ సత్యతిరస్కారులు, ఈ సందేశాన్ని (ఖుర్ఆన్ ను) విన్నప్పుడు, తమ చూపులతో నీ కాళ్ళు ఊడగొడతారా అన్నట్లు (నిన్ను జారించి పడవేసేటట్లు) నిన్ను చూస్తున్నారు. మరియు వారు నిన్ను (ఓ ముహమ్మద్!): "నిశ్చయంగా ఇతడు పిచ్చివాడు!" అని అంటున్నారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا هُوَ إِلَّا ذِكْرٌ لِلْعَالَمِينَ 52
కాని సర్వలోకాల (వారికి) ఇదొక హితోపదేశం మాత్రమే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్