Ar-Rahman

سورة الرحمن

సూరా 55 · మక్కీ · 78 ఆయత్‌లు

55:1జుజ్ 27 · పు. 531

الرَّحْمَٰنُ1

అనంత కరుణామయుడు (అల్లాహ్)!
55:2జుజ్ 27 · పు. 531

عَلَّمَ الْقُرْآنَ2

ఆయనే ఈ ఖుర్ఆన్ ను నేర్పాడు.
55:3జుజ్ 27 · పు. 531

خَلَقَ الْإِنْسَانَ3

ఆయనే మానవుణ్ణి సృష్టించాడు.
55:4జుజ్ 27 · పు. 531

عَلَّمَهُ الْبَيَانَ4

ఆయనే అతనికి మాట్లాడటం నేర్పాడు.
55:5జుజ్ 27 · పు. 531

الشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ5

సూర్యుడు మరియు చంద్రుడు ఒక నియమిత గమనాన్ని (నియమిత పరిధిలో) అనుసరిస్తున్నారు.
55:6జుజ్ 27 · పు. 531

وَالنَّجْمُ وَالشَّجَرُ يَسْجُدَانِ6

మరియు నక్షత్రాలు మరియు వృక్షాలు అన్నీ ఆయనకు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటాయి.
55:7జుజ్ 27 · పు. 531

وَالسَّمَاءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيزَانَ7

మరియు ఆయనే ఖగోళాన్ని పైకెత్తి ఉంచాడు మరియు ఆయనే త్రాసును నెలకొల్పాడు.
55:8జుజ్ 27 · పు. 531

أَلَّا تَطْغَوْا فِي الْمِيزَانِ8

తద్వారా మీరు తూకంలో మోసానికి పాల్పడకూడదని!
55:9జుజ్ 27 · పు. 531

وَأَقِيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيزَانَ9

మరియు న్యాయంగా తూకం చేయండి మరియు తూకంలో తగ్గించకండి.
55:10జుజ్ 27 · పు. 531

وَالْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ10

మరియు ఆయన, భూమిని సకల జీవరాసుల కొరకు ఉంచాడు.
55:11జుజ్ 27 · పు. 531

فِيهَا فَاكِهَةٌ وَالنَّخْلُ ذَاتُ الْأَكْمَامِ11

అందులో రకరకాల ఫలాలు మరియు పొరలలో (పుష్పకోశాలలో) ఉండే ఖర్జూర పండ్లు ఉన్నాయి.
55:12జుజ్ 27 · పు. 531

وَالْحَبُّ ذُو الْعَصْفِ وَالرَّيْحَانُ12

మరియు దంట్లపై (పొరలలో చుట్టబడి) ఉన్న ధాన్యం మరియు సుగంధ పుష్పాలు కూడా!
55:13 · Which of the favors of your Lordజుజ్ 27 · పు. 531

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ13

అయితే మీరిరువురు (మానవులు మరియు జిన్నాతులు) మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:14జుజ్ 27 · పు. 531

خَلَقَ الْإِنْسَانَ مِنْ صَلْصَالٍ كَالْفَخَّارِ14

ఆయన మానవుణ్ణి పెంకులాంటి శబ్దమిచ్చే మట్టితో సృష్టించాడు.
55:15జుజ్ 27 · పు. 531

وَخَلَقَ الْجَانَّ مِنْ مَارِجٍ مِنْ نَارٍ15

మరియు జిన్నాతులను అగ్నిజ్వాలలతో సృష్టించాడు.
55:16జుజ్ 27 · పు. 531

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ16

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:17జుజ్ 27 · పు. 531

رَبُّ الْمَشْرِقَيْنِ وَرَبُّ الْمَغْرِبَيْنِ17

ఆయనే రెండు తూర్పు (దిక్కు)లకు మరియు రెండు పడమర (దిక్కు)లకు ప్రభువు.
55:18జుజ్ 27 · పు. 531

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ18

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:19జుజ్ 27 · పు. 532

مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ19

ఆయనే రెండు సముద్రాలను కలుసుకోవటానికి వదలిపెట్టాడు.
55:20జుజ్ 27 · పు. 532

بَيْنَهُمَا بَرْزَخٌ لَا يَبْغِيَانِ20

ఆ రెండింటి మధ్య, అవి అతిక్రమించలేని అడ్డు తెర వుంది.
55:21జుజ్ 27 · పు. 532

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ21

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:22జుజ్ 27 · పు. 532

يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ22

ఆ రెండింటి నుండి ముత్యాలు మరియు పగడాలు వస్తాయి.
55:23జుజ్ 27 · పు. 532

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ23

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:24జుజ్ 27 · పు. 532

وَلَهُ الْجَوَارِ الْمُنْشَآتُ فِي الْبَحْرِ كَالْأَعْلَامِ24

మరియు ఎత్తైన కొండల వలే సముద్రంలో పయనించే ఓడలు ఆయనకు చెందినవే!
55:25జుజ్ 27 · పు. 532

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ25

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:26జుజ్ 27 · పు. 532

كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ26

దానిపై (భూమిపై) నున్నది ప్రతిదీ నశిస్తుంది.
55:27జుజ్ 27 · పు. 532

وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ27

మరియు మిగిలివుండేది, కేవలం మహిమాన్వితుడు మరియు పరమదాత అయిన నీ ప్రభువు ముఖం (ఉనికి) మాత్రమే!
55:28జుజ్ 27 · పు. 532

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ28

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:29జుజ్ 27 · పు. 532

يَسْأَلُهُ مَنْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِي شَأْنٍ29

భూమిలో మరియు ఆకాశాలలో నున్న ప్రతిదీ (తన జీవనోపాధి కొరకు) ఆయననే యాచిస్తుంది. మరియు ప్రతి క్షణం (రోజు) ఆయన ఒక కార్యంలో నిమగ్నుడై ఉంటాడు.
55:30జుజ్ 27 · పు. 532

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ30

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:31జుజ్ 27 · పు. 532

سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ الثَّقَلَانِ31

భారాలను మోసే మీరిద్దరు! త్వరలోనే మేము మీ విషయం నిర్ణయించగలము.
55:32జుజ్ 27 · పు. 532

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ32

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:33జుజ్ 27 · పు. 532

يَا مَعْشَرَ الْجِنِّ وَالْإِنْسِ إِنِ اسْتَطَعْتُمْ أَنْ تَنْفُذُوا مِنْ أَقْطَارِ السَّمَاوَاتِ وَالْأَرْضِ فَانْفُذُوا ۚ لَا تَنْفُذُونَ إِلَّا بِسُلْطَانٍ33

ఓ జిన్నాతుల మరియు మానవ జాతి వారలారా! ఒకవేళ మీరు ఆకాశాల మరియు భూమి యొక్క సరిహద్దుల నుండి బయటికి వెళ్ళి పోగలిగితే, వెళ్ళిపోండి! ఆయన (అల్లాహ్) యొక్క సెలవు లేనిదే మీరు వాటి నుండి వెళ్ళి పోలేరు.
55:34జుజ్ 27 · పు. 532

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ34

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:35జుజ్ 27 · పు. 532

يُرْسَلُ عَلَيْكُمَا شُوَاظٌ مِنْ نَارٍ وَنُحَاسٌ فَلَا تَنْتَصِرَانِ35

మీ ఇద్దరి పైకి అగ్నిజ్వాలలు మరియు పొగ పంపబడతాయి. అప్పుడు మీరు ఎదుర్కోలేరు (మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు).
55:36జుజ్ 27 · పు. 532

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ36

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:37జుజ్ 27 · పు. 532

فَإِذَا انْشَقَّتِ السَّمَاءُ فَكَانَتْ وَرْدَةً كَالدِّهَانِ37

మరియు ఆకాశం ప్రేలిపోయినప్పుడు అది మండే నూనెగా ఎర్రగా మారిపోతుంది.
55:38జుజ్ 27 · పు. 532

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ38

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:39జుజ్ 27 · పు. 532

فَيَوْمَئِذٍ لَا يُسْأَلُ عَنْ ذَنْبِهِ إِنْسٌ وَلَا جَانٌّ39

ఇక, ఆ రోజు ఏ మానవునితో గానీ, లేక ఏ జిన్నాతునితో గానీ అతని పాపాలను గురించి అడగడం జరుగదు.
55:40జుజ్ 27 · పు. 532

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ40

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:41జుజ్ 27 · పు. 532

يُعْرَفُ الْمُجْرِمُونَ بِسِيمَاهُمْ فَيُؤْخَذُ بِالنَّوَاصِي وَالْأَقْدَامِ41

ఈ నేరస్తులు వారి వారి ముఖ చిహ్నాలతోనే గుర్తింపబడతారు. అప్పుడు వారు, వారి ముంగురులు మరియు కాళ్ళు పట్టి లాగబడతారు.
55:42జుజ్ 27 · పు. 533

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ42

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:43జుజ్ 27 · పు. 533

هَٰذِهِ جَهَنَّمُ الَّتِي يُكَذِّبُ بِهَا الْمُجْرِمُونَ43

ఈ నేరస్తులు అసత్యమని తిరస్కరిస్తూ వుండిన నరకం ఇదే!
55:44జుజ్ 27 · పు. 533

يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ44

వారి దానిలో (ఆ నరకంలో) మరియు సలసల కాగే నీటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.
55:45జుజ్ 27 · పు. 533

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ45

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:46జుజ్ 27 · పు. 533

وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ جَنَّتَانِ46

మరియు ఎవడైతే తన ప్రభువు సన్నధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో, అతనికి రెండు స్వర్గవనాలుంటాయి.
55:47జుజ్ 27 · పు. 533

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ47

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:48జుజ్ 27 · పు. 533

ذَوَاتَا أَفْنَانٍ48

అవి రెండూ అనేక శాఖల (వృక్షాల)తో నిండి ఉంటాయి.
55:49జుజ్ 27 · పు. 533

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ49

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:50జుజ్ 27 · పు. 533

فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ50

ఆ రెండింటిలో రెండు సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.
55:51జుజ్ 27 · పు. 533

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ51

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:52జుజ్ 27 · పు. 533

فِيهِمَا مِنْ كُلِّ فَاكِهَةٍ زَوْجَانِ52

ఆ రెండింటిలో ప్రతి ఫలం జోడుగా (రెండు రకాలుగా) ఉంటుంది.
55:53జుజ్ 27 · పు. 533

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ53

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:54జుజ్ 27 · పు. 533

مُتَّكِئِينَ عَلَىٰ فُرُشٍ بَطَائِنُهَا مِنْ إِسْتَبْرَقٍ ۚ وَجَنَى الْجَنَّتَيْنِ دَانٍ54

వారు జరీ పని అస్తరుగల పట్టు తివాచీల మీద ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు ఆ రెండు స్వర్గవనాల ఫలాలు దగ్గరగా అందుబాటులో ఉంటాయి.
55:55జుజ్ 27 · పు. 533

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ55

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:56జుజ్ 27 · పు. 533

فِيهِنَّ قَاصِرَاتُ الطَّرْفِ لَمْ يَطْمِثْهُنَّ إِنْسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ56

అందులో తమ దృష్టి ఎల్లప్పుడూ క్రిందికి వంచి ఉంచే నిర్మల కన్యలుంటారు. వారిని ఇంతకు పూర్వం ఏ మానవుడు గానీ, ఏ జిన్నాతు గానీ తాకి ఉండడు.
55:57జుజ్ 27 · పు. 533

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ57

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:58జుజ్ 27 · పు. 533

كَأَنَّهُنَّ الْيَاقُوتُ وَالْمَرْجَانُ58

వారు కెంపులను (మాణిక్యాలను) మరియు పగడాలను పోలి ఉంటారు.
55:59జుజ్ 27 · పు. 533

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ59

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:60జుజ్ 27 · పు. 533

هَلْ جَزَاءُ الْإِحْسَانِ إِلَّا الْإِحْسَانُ60

సత్కార్యానికి మంచి ప్రతిఫలం తప్ప మరేమైనా ఉంటుందా?
55:61జుజ్ 27 · పు. 533

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ61

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:62జుజ్ 27 · పు. 533

وَمِنْ دُونِهِمَا جَنَّتَانِ62

మరియు ఆ రెండే కాక ఇంకా రెండు స్వర్గవనాలుంటాయి.
55:63జుజ్ 27 · పు. 533

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ63

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:64జుజ్ 27 · పు. 533

مُدْهَامَّتَانِ64

అవి దట్టంగా ముదరు పచ్చగా ఉంటాయి.
55:65జుజ్ 27 · పు. 533

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ65

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:66జుజ్ 27 · పు. 533

فِيهِمَا عَيْنَانِ نَضَّاخَتَانِ66

ఆ రెండు తోటలలో పొంగి ప్రవహించే రెండు చెలమలుంటాయి.
55:67జుజ్ 27 · పు. 533

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ67

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:68జుజ్ 27 · పు. 533

فِيهِمَا فَاكِهَةٌ وَنَخْلٌ وَرُمَّانٌ68

ఆ రెండింటిలో ఫలాలు, ఖర్జూరాలు మరియు దానిమ్మలు ఉంటాయి.
55:69జుజ్ 27 · పు. 533

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ69

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:70జుజ్ 27 · పు. 534

فِيهِنَّ خَيْرَاتٌ حِسَانٌ70

వాటిలో గుణవంతులు, సౌందర్యవతులైన స్త్రీలు ఉంటారు.
55:71జుజ్ 27 · పు. 534

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ71

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:72జుజ్ 27 · పు. 534

حُورٌ مَقْصُورَاتٌ فِي الْخِيَامِ72

నిర్మలమైన, శీలవంతులైన స్త్రీలు (హూర్) డేరాలలో ఉంటారు.
55:73జుజ్ 27 · పు. 534

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ73

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:74జుజ్ 27 · పు. 534

لَمْ يَطْمِثْهُنَّ إِنْسٌ قَبْلَهُمْ وَلَا جَانٌّ74

ఆ స్త్రీలను ఇంతకు ముందు ఏ మానవుడు కాని, ఏ జిన్నాతు కాని తాకి ఉండడు.
55:75జుజ్ 27 · పు. 534

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ75

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:76జుజ్ 27 · పు. 534

مُتَّكِئِينَ عَلَىٰ رَفْرَفٍ خُضْرٍ وَعَبْقَرِيٍّ حِسَانٍ76

వారు అందమైన తివాచీల మీద ఆకుపచ్చని దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.
55:77జుజ్ 27 · పు. 534

فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ77

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
55:78జుజ్ 27 · పు. 534

تَبَارَكَ اسْمُ رَبِّكَ ذِي الْجَلَالِ وَالْإِكْرَامِ78

మహిమాన్వితుడు మరియు పరమ దాత అయిన నీ ప్రభువు పేరే సర్వశ్రేష్ఠమైనది.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Hani Ar-Rifai - Ar-Rahman · Tlawati