సూరా 55 · జుజ్ 27
Ar-Rahman · 55:41
يُعْرَفُ الْمُجْرِمُونَ بِسِيمَاهُمْ فَيُؤْخَذُ بِالنَّوَاصِي وَالْأَقْدَامِ
ఈ నేరస్తులు వారి వారి ముఖ చిహ్నాలతోనే గుర్తింపబడతారు. అప్పుడు వారు, వారి ముంగురులు మరియు కాళ్ళు పట్టి లాగబడతారు.
తఫ్సీర్
అపరాదులు ప్రళయదినమున తమ చిహ్నాలైన ముఖములు నల్లబడటం,కళ్ళు నీలంగా మారటం ద్వారా గుర్తించబడుతారు. అప్పుడు వారి నుదుటులను వారి కాళ్ళతో కలిపి కట్టబడి వారు నరకంలో విసరబడుతారు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి