Al-Ma'arij

سورة المعارج

సూరా 70 · మక్కీ · 44 ఆయత్‌లు

70:1జుజ్ 29 · పు. 568

سَأَلَ سَائِلٌ بِعَذَابٍ وَاقِعٍ1

ప్రశ్నించేవాడు, ఆ అనివార్యమైన శిక్షను గురించి ప్రశ్నించాడు;
70:2జుజ్ 29 · పు. 568

لِلْكَافِرِينَ لَيْسَ لَهُ دَافِعٌ2

సత్యతిరస్కారులకు విధించబడే దాని గురించి; దానిని ఎవ్వడూ తొలగించలేడు.
70:3జుజ్ 29 · పు. 568

مِنَ اللَّهِ ذِي الْمَعَارِجِ3

అది ఆరోహణ మార్గాలకు యజమానుడైన అల్లాహ్ తరఫు నుండి వస్తుంది.
70:4జుజ్ 29 · పు. 568

تَعْرُجُ الْمَلَائِكَةُ وَالرُّوحُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ4

యాభై వేల సంవత్సరాలకు సమానమైన (ప్రమాణం గల) ఒక రోజులో, దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్) ఆయన వద్దకు అధిరోహిస్తారు.
70:5జుజ్ 29 · పు. 568

فَاصْبِرْ صَبْرًا جَمِيلًا5

కావున (ఓ ముహమ్మద్!) నీవు సహనం వహించు, ఉత్తమమైన సహనంతో!
70:6జుజ్ 29 · పు. 568

إِنَّهُمْ يَرَوْنَهُ بَعِيدًا6

వాస్తవానికి, వారు (ప్రజలు) అది (ఆ దినం) దూరంగా ఉందని అనుకుంటున్నారు.
70:7జుజ్ 29 · పు. 568

وَنَرَاهُ قَرِيبًا7

కాని మాకది అతి దగ్గరలో కనిపిస్తోంది.
70:8జుజ్ 29 · పు. 568

يَوْمَ تَكُونُ السَّمَاءُ كَالْمُهْلِ8

ఆ రోజు ఆకాశం మరిగే సీసం వలే (నూనే వలే) అయి పోతుంది.
70:9జుజ్ 29 · పు. 568

وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ9

మరియు కొండలు ఏకిన ఉన్ని వలె అయి పోతాయి.
70:10జుజ్ 29 · పు. 568

وَلَا يَسْأَلُ حَمِيمٌ حَمِيمًا10

మరియు ప్రాణ స్నేహితుడు కూడా తన స్నేహితుని (క్షేమాన్ని) అడగడు.
70:11జుజ్ 29 · పు. 569

يُبَصَّرُونَهُمْ ۚ يَوَدُّ الْمُجْرِمُ لَوْ يَفْتَدِي مِنْ عَذَابِ يَوْمِئِذٍ بِبَنِيهِ11

వారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ రోజు అపరాధి తన సంతానాన్ని పరిహారంగా ఇచ్చి అయినా శిక్ష నుండి తప్పించుకోగోరుతాడు;
70:12జుజ్ 29 · పు. 569

وَصَاحِبَتِهِ وَأَخِيهِ12

మరియు తన సహవాసిని మరియు తన సోదరుణ్ణి;
70:13జుజ్ 29 · పు. 569

وَفَصِيلَتِهِ الَّتِي تُؤْوِيهِ13

మరియు తనకు ఆశ్రయమిచ్చిన దగ్గరి బంధువులను;
70:14జుజ్ 29 · పు. 569

وَمَنْ فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنْجِيهِ14

మరియు భూమిలో ఉన్న వారినందరినీ కూడా ఇచ్చి అయినా, తాను విముక్తి పొందాలని కోరుతాడు.
70:15జుజ్ 29 · పు. 569

كَلَّا ۖ إِنَّهَا لَظَىٰ15

కాని అలా కానేరదు! నిశ్చయంగా, ఆ మండే అగ్నిజ్వాల (అతని కొరకు వేచి ఉంటుంది)!
70:16జుజ్ 29 · పు. 569

نَزَّاعَةً لِلشَّوَىٰ16

అది అతని చర్మాన్ని పూర్తిగా వలచి కాల్చి వేస్తుంది.
70:17జుజ్ 29 · పు. 569

تَدْعُو مَنْ أَدْبَرَ وَتَوَلَّىٰ17

అది (సత్యం నుండి) వెనుదిరిగి మరియు వెన్ను చూపి, పోయేవారిని (అందరినీ) పిలుస్తుంది.
70:18జుజ్ 29 · పు. 569

وَجَمَعَ فَأَوْعَىٰ18

మరియు (ధనాన్ని) కూడబెట్టి, దానిని దాచేవారిని.
70:19జుజ్ 29 · పు. 569

۞ إِنَّ الْإِنْسَانَ خُلِقَ هَلُوعًا19

నిశ్చయంగా, మానవుడు ఆత్రగాడుగా (తొందరపడేవాడిగా) సృష్టించబడ్డాడు;
70:20జుజ్ 29 · పు. 569

إِذَا مَسَّهُ الشَّرُّ جَزُوعًا20

తనకు కీడు కలిగినప్పుడు వాడు ఆందోళన చెందుతాడు;
70:21జుజ్ 29 · పు. 569

وَإِذَا مَسَّهُ الْخَيْرُ مَنُوعًا21

మరియు తనకు మేలు కలిగినపుడు స్వార్థపరునిగా ప్రవర్తిస్తాడు.
70:22జుజ్ 29 · పు. 569

إِلَّا الْمُصَلِّينَ22

నమాజ్ ను ఖచ్ఛితంగా పాఠించేవారు తప్ప!
70:23జుజ్ 29 · పు. 569

الَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ دَائِمُونَ23

ఎవరైతే తమ నమాజ్ ను సదా నియమంతో పాటిస్తారో;
70:24జుజ్ 29 · పు. 569

وَالَّذِينَ فِي أَمْوَالِهِمْ حَقٌّ مَعْلُومٌ24

మరియు అలాంటి వారు, ఎవరైతే తమ సంపదలలో (ఇతరులకు) ఉన్న హక్కును సమ్మతిస్తారో!
70:25జుజ్ 29 · పు. 569

لِلسَّائِلِ وَالْمَحْرُومِ25

యాచకులకు మరియు లేమికి గురి అయిన వారికి;
70:26జుజ్ 29 · పు. 569

وَالَّذِينَ يُصَدِّقُونَ بِيَوْمِ الدِّينِ26

మరియు అలాంటి వారికి, ఎవరైతే తీర్పుదినాన్ని సత్యమని నమ్ముతారో;
70:27జుజ్ 29 · పు. 569

وَالَّذِينَ هُمْ مِنْ عَذَابِ رَبِّهِمْ مُشْفِقُونَ27

మరియు ఎవరైతే తమ ప్రభువు శిక్షకు భయపడుతారో!
70:28జుజ్ 29 · పు. 569

إِنَّ عَذَابَ رَبِّهِمْ غَيْرُ مَأْمُونٍ28

నిశ్చయంగా, వారి ప్రభువు యొక్క ఆ శిక్ష; దాని పట్ల ఎవ్వరూ నిర్భయంగా ఉండలేరు!
70:29జుజ్ 29 · పు. 569

وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ29

మరియు ఎవరైతే, తమ మర్మాంగాలను కాపాడుకుంటారో -
70:30జుజ్ 29 · పు. 569

إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ30

తమ భార్యలు (అజ్వాజ్), లేదా ధర్మసమ్మతంగా తమ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలతో తప్ప - అలాంటప్పుడు వారు నిందార్హులు కారు.
70:31జుజ్ 29 · పు. 569

فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ31

కాని ఎవరైతే వీటిని మించి పోగోరుతారో, అలాంటివారే మితిమీరి పోయేవారు.
70:32జుజ్ 29 · పు. 569

وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ32

మరియు ఎవరైతే తమ అమానతులను మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో;
70:33జుజ్ 29 · పు. 569

وَالَّذِينَ هُمْ بِشَهَادَاتِهِمْ قَائِمُونَ33

మరియు ఎవరైతే తమ సాక్ష్యాల మీద స్థిరంగా ఉంటారో;
70:34జుజ్ 29 · పు. 569

وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ34

మరియు ఎవరైతే తమ నమాజులను కాపాడుకుంటారో;
70:35జుజ్ 29 · పు. 569

أُولَٰئِكَ فِي جَنَّاتٍ مُكْرَمُونَ35

ఇలాంటి వారంతా సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు.
70:36జుజ్ 29 · పు. 569

فَمَالِ الَّذِينَ كَفَرُوا قِبَلَكَ مُهْطِعِينَ36

ఈ సత్యతిరస్కారులకు ఏమయ్యింది? వీరెందుకు హడావిడిగా, నీ ముందు ఇటూ అటూ తిరుగుతున్నారు?
70:37జుజ్ 29 · పు. 569

عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ عِزِينَ37

కుడి ప్రక్క నుండి మరియు ఎడమ ప్రక్క నుండి గుంపులుగా;
70:38జుజ్ 29 · పు. 569

أَيَطْمَعُ كُلُّ امْرِئٍ مِنْهُمْ أَنْ يُدْخَلَ جَنَّةَ نَعِيمٍ38

ఏమీ? వారిలో ప్రతి ఒక్కడూ, తాను పరమ సుఖాలు గల స్వర్గవనంలో ప్రవేశింప జేయబడతానని ఆశిస్తున్నాడా?
70:39జుజ్ 29 · పు. 569

كَلَّا ۖ إِنَّا خَلَقْنَاهُمْ مِمَّا يَعْلَمُونَ39

అలా కానేరదు! నిశ్చయంగా, మేము వారిని దేనితో పుట్టించామో వారికి బాగా తెలుసు!
70:40జుజ్ 29 · పు. 569

فَلَا أُقْسِمُ بِرَبِّ الْمَشَارِقِ وَالْمَغَارِبِ إِنَّا لَقَادِرُونَ40

కావున! నేను తూర్పుల మరియు పడమరల ప్రభువు శపథం చేసి చెబుతున్నాను. నిశ్చయంగా, మేము అలా చేయగల సమర్థులము;
70:41జుజ్ 29 · పు. 570

عَلَىٰ أَنْ نُبَدِّلَ خَيْرًا مِنْهُمْ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ41

వారికి బదులుగా వారి కంటే ఉత్తమమైన వారిని వారి స్థానంలో తీసుకురావటానికి; మరియు మమ్మల్ని మించి పోయేవారు ఎవ్వరూ లేరు.
70:42జుజ్ 29 · పు. 570

فَذَرْهُمْ يَخُوضُوا وَيَلْعَبُوا حَتَّىٰ يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي يُوعَدُونَ42

కావున వారిని - వారితో వాగ్దానం చేయబడిన ఆ దినానికి చేరే వరకు - వ్యర్థపు మాటలలో మరియు విలాస వినోదాల్లో విడిచిపెట్టు.
70:43జుజ్ 29 · పు. 570

يَوْمَ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ سِرَاعًا كَأَنَّهُمْ إِلَىٰ نُصُبٍ يُوفِضُونَ43

ఆ రోజు వారు తమ సమాధుల నుండి లేచి, తమ గమ్యస్థానాలకు చేరుకోవటానికి తొందర పడుతూ వేగంగా బయటికి వస్తారు.
70:44జుజ్ 29 · పు. 570

خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۚ ذَٰلِكَ الْيَوْمُ الَّذِي كَانُوا يُوعَدُونَ44

వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, అవమానం వారిని క్రమ్ముకొని ఉంటుంది. అదే వారికి వాగ్దానం చేయబడిన దినం!

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి