الْحَاقَّةُ 1
ఆ అనివార్య సంఘటన (పునరుత్థానం)!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا الْحَاقَّةُ 2
ఏమిటా అనివార్య సంఘటన?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا أَدْرَاكَ مَا الْحَاقَّةُ 3
మరియు ఆ అనివార్య సంఘటన, అంటే ఏమిటో నీకేమి తెలుసు?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كَذَّبَتْ ثَمُودُ وَعَادٌ بِالْقَارِعَةِ 4
సమూద్ మరియు ఆద్ జాతి వారు అకస్మాత్తుగా విరుచుకుపడే ఆ ఉపద్రవాన్ని అసత్యమని తిరస్కరించారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَمَّا ثَمُودُ فَأُهْلِكُوا بِالطَّاغِيَةِ 5
కావున సమూద్ జాతి వారైతే ఒక భయంకరమైన గర్జన ద్వారా నాశనం చేయబడ్డారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ 6
మరియు ఆద్ జాతి వారేమో అతి తీవ్రమైన తుఫాను గాలి ద్వారా నాశనం చేయబడ్డారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ 7
ఆయన (అల్లాహ్), దానిని వారి మీద ఏడు రాత్రులు మరియు ఎనిమిది పగళ్ళ వరకు ఎడతెగకుండా ఆవరింపజేశాడు. దాని వలన వారు వేళ్ళతో పెళ్ళగించబడిన ఖర్జూరపు బోదెల వలే పాడై పోవటం, నీవు చూస్తావు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَهَلْ تَرَىٰ لَهُمْ مِنْ بَاقِيَةٍ 8
అయితే ఇప్పుడు వారిలో ఎవరైనా మిగిలి ఉన్నట్లు నీవు చూస్తున్నావా?
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَجَاءَ فِرْعَوْنُ وَمَنْ قَبْلَهُ وَالْمُؤْتَفِكَاتُ بِالْخَاطِئَةِ 9
ఫిర్ఔన్ మరియు అతనికి పూర్వం గతించిన వారూ మరియు తలక్రిందులు చేయబడిన నగరాల వారూ, అందరూ గొప్ప నేరాలకు పాల్పడినవారే.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَعَصَوْا رَسُولَ رَبِّهِمْ فَأَخَذَهُمْ أَخْذَةً رَابِيَةً 10
మరియు వారు తమ ప్రభువు పంపిన ప్రవక్తలకు అవిధేయత కనబరచారు, కావున ఆయన వారిని కఠినమైన పట్టుతో పట్టుకున్నాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّا لَمَّا طَغَى الْمَاءُ حَمَلْنَاكُمْ فِي الْجَارِيَةِ 11
నిశ్చయంగా, ఎప్పుడైతే (నూహ్ తుఫాన్) నీరు హద్దు లేకుండా ఉప్పొంగి పోయిందో! అప్పుడు మేము, మిమ్మల్ని పయనించే (నావలో) ఎక్కించాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةً وَتَعِيَهَا أُذُنٌ وَاعِيَةٌ 12
దానిని, మీకొక హితబోధగానూ మరియు జ్ఞాపకముంచుకోగల చెవి, దానిని జ్ఞాపకం ఉంచుకోవటానికి అనువైనదిగా చేశాము.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَإِذَا نُفِخَ فِي الصُّورِ نَفْخَةٌ وَاحِدَةٌ 13
ఇక ఎప్పుడైతే ఒక పెద్ద ధ్వనితో బాకా ఊదబడుతుందో!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَحُمِلَتِ الْأَرْضُ وَالْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَاحِدَةً 14
మరియు భూమి మరియు పర్వతాలు పైకి ఎత్తబడి ఒక పెద్ద దెబ్బతో తుత్తునియలుగా చేయబడతాయో!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَيَوْمَئِذٍ وَقَعَتِ الْوَاقِعَةُ 15
అప్పుడు, ఆ రోజున సంభవించవలసిన ఆ అనివార్య సంఘటన సంభవిస్తుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَانْشَقَّتِ السَّمَاءُ فَهِيَ يَوْمَئِذٍ وَاهِيَةٌ 16
మరియు ఆ రోజున ఆకాశం బ్రద్దలై పోతుంది మరియు దాని వ్యవస్థ సడలి పోతుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَالْمَلَكُ عَلَىٰ أَرْجَائِهَا ۚ وَيَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ يَوْمَئِذٍ ثَمَانِيَةٌ 17
మరియు దేవదూతలు దాని (అర్ష్) ప్రక్కలలో ఉంటారు. మరియు నీ ప్రభువు యొక్క సింహాసనాన్ని (అర్ష్ ను), ఆ రోజు ఎనిమిది మంది (దేవదూతలు) ఎత్తుకొని ఉంటారు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَوْمَئِذٍ تُعْرَضُونَ لَا تَخْفَىٰ مِنْكُمْ خَافِيَةٌ 18
ఆ రోజు మీరు (తీర్పు కొరకు) హాజరు చేయబడతారు. మీరు దాచిన ఏ రహస్యం కూడా (ఆ రోజు) దాగి ఉండదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَيَقُولُ هَاؤُمُ اقْرَءُوا كِتَابِيَهْ 19
ఇక ఎవనికైతే తన కర్మపత్రము కుడి చేతిలో ఇవ్వబడుతుందో, అతడు ఇలా అంటాడు: "ఇదిగో నా కర్మపత్రాన్ని తీసుకొని చదవండి!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنِّي ظَنَنْتُ أَنِّي مُلَاقٍ حِسَابِيَهْ 20
నిశ్చయంగా, నా లెక్క నాకు తప్పకుండా లభిస్తుందని నేను భావించేవాడిని!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَهُوَ فِي عِيشَةٍ رَاضِيَةٍ 21
కావున, అతడు సంతోషకరమైన జీవితం గడుపుతాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فِي جَنَّةٍ عَالِيَةٍ 22
అత్యున్నతమైన స్వర్గవనంలో.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ قُطُوفُهَا دَانِيَةٌ 23
దాని పండ్లగుత్తులు, సమీపంలో వ్రేలాడుతూ ఉంటాయి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ 24
(వారితో ఇలా అనబడుతుంది): "గడిచి పోయిన దినాలలో మీరు చేసి పంపిన కర్మలకు ప్రతిఫలంగా, ఇప్పుడు మీరు హాయిగా తినండి మరియు త్రాగండి!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِشِمَالِهِ فَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُوتَ كِتَابِيَهْ 25
ఇక ఎవడికైతే, తన కర్మపత్రం ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, అతడు ఇలా వాపోతాడు: "అయ్యో! నా పాడుగాను! నా కర్మపత్రం అసలు నాకు ఇవ్వబడకుండా ఉంటే ఎంత బాగుండేది!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ 26
మరియు నా లెక్క ఏమిటో నాకు తెలియకుంటే ఎంత బాగండేది!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ يَا لَيْتَهَا كَانَتِ الْقَاضِيَةَ 27
అయ్యో! నా పాడుగాను! అది (ఆ మరణమే) నాకు అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ مَا أَغْنَىٰ عَنِّي مَالِيَهْ ۜ 28
నా సంపద నాకేమీ పనికి రాలేదు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ هَلَكَ عَنِّي سُلْطَانِيَهْ 29
నా అధికారమంతా అంతమై పోయింది!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ خُذُوهُ فَغُلُّوهُ 30
(అప్పుడు ఇలా ఆజ్ఞ ఇవ్వబడుతుంది): "అతన్ని పట్టుకోండి మరియు అతని మెడలో సంకెళ్ళు వేయండి;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ الْجَحِيمَ صَلُّوهُ 31
తరువాత అతనిని భగభగమండే నరకాగ్నిలో వేయండి.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ 32
ఆ తరువాత అతనిని డెబ్భై మూరల పొడవు గల గొలుసుతో బంధించండి!"
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهُ كَانَ لَا يُؤْمِنُ بِاللَّهِ الْعَظِيمِ 33
వాస్తవానికి అతడు సర్వోత్తముడైన అల్లాహ్ ను విశ్వసించేవాడు కాదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ 34
మరియు నిరుపేదలకు ఆహారం పెట్టమని ప్రోత్సహించేవాడు కాదు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَلَيْسَ لَهُ الْيَوْمَ هَاهُنَا حَمِيمٌ 35
కావున, ఈనాడు అతనికి ఇక్కడ ఏ స్నేహితుడూ లేడు;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ 36
మరియు అసహ్యకరమైన గాయాల కడుగు తప్ప, మరొక ఆహారమూ లేదు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَا يَأْكُلُهُ إِلَّا الْخَاطِئُونَ 37
దానిని పాపులు తప్ప మరెవ్వరూ తినరు!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَلَا أُقْسِمُ بِمَا تُبْصِرُونَ 38
కావున, నేను మీరు చూడగలిగే వాటి శపథం చేస్తున్నాను;
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا لَا تُبْصِرُونَ 39
మరియు మీరు చూడలేనట్టని వాటి (శపథం) కూడా!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ 40
నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుని (పై అవతరింప జేయబడిన) వాక్కు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَا تُؤْمِنُونَ 41
మరియు ఇది ఒక కవి యొక్క వాక్కు కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَا تَذَكَّرُونَ 42
మరియు ఇది ఏ జ్యాతిష్యుని వాక్కు కూడా కాదు! మీరు గ్రహించేది చాలా తక్కువ.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ تَنْزِيلٌ مِنْ رَبِّ الْعَالَمِينَ 43
ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరించింది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ الْأَقَاوِيلِ 44
ఒకవేళ ఇతను (ఈ ప్రవక్త), మా (అల్లాహ్ ను) గురించి ఏదైనా అబద్ధపు మాట కల్పించి ఉంటే!
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ لَأَخَذْنَا مِنْهُ بِالْيَمِينِ 45
మేము అతని కుడి చేతిని పట్టుకునే వారం.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ ثُمَّ لَقَطَعْنَا مِنْهُ الْوَتِينَ 46
తరువాత అతని (మెడ) రక్తనాళాన్ని కోసేవారం.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَمَا مِنْكُمْ مِنْ أَحَدٍ عَنْهُ حَاجِزِينَ 47
అప్పుడు మీలో నుండి ఏ ఒక్కడు కూడా అతనిని (మా శిక్ష నుండి) కాపాడ లేక పోయేవాడు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّهُ لَتَذْكِرَةٌ لِلْمُتَّقِينَ 48
మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) దైవభీతి గల వారికొక హితోపదేశం.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنْكُمْ مُكَذِّبِينَ 49
మరియు నిశ్చయంగా మీలో కొందరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని అనేవారు ఉన్నారని మాకు బాగా తెలుసు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّهُ لَحَسْرَةٌ عَلَى الْكَافِرِينَ 50
మరియు నిశ్చయంగా, ఇది (ఈ తిరస్కారం) సత్యతిరస్కారులకు దుఃఖ కారణమవుతుంది.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ وَإِنَّهُ لَحَقُّ الْيَقِينِ 51
మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) నమ్మదగిన సత్యం.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్ فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ 52
కావున నీవు సర్వోత్తముడైన నీ ప్రభువు పవిత్ర నామాన్ని స్తుతించు.
తఫ్సీర్ అధ్యయనం బుక్మార్క్