لَا أُقْسِمُ بِهَٰذَا الْبَلَدِ1
Al-Balad
سورة البلد
సూరా 90 · మక్కీ · 20 ఆయత్లు
90:1జుజ్ 30 · పు. 594
కాదు, నేను ఈ నగరం (మక్కా) సాక్షిగా (అంటున్నాను)!
90:2జుజ్ 30 · పు. 594
وَأَنْتَ حِلٌّ بِهَٰذَا الْبَلَدِ2
మరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది.
90:3జుజ్ 30 · పు. 594
وَوَالِدٍ وَمَا وَلَدَ3
మరియు తండ్రి (మూలపురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా!
90:4జుజ్ 30 · పు. 594
لَقَدْ خَلَقْنَا الْإِنْسَانَ فِي كَبَدٍ4
వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము.
90:5జుజ్ 30 · పు. 594
أَيَحْسَبُ أَنْ لَنْ يَقْدِرَ عَلَيْهِ أَحَدٌ5
ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకో లేడని అతడు భావిస్తున్నాడా?
90:6జుజ్ 30 · పు. 594
يَقُولُ أَهْلَكْتُ مَالًا لُبَدًا6
అతడు: "నేను విపరీత ధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు.
90:7జుజ్ 30 · పు. 594
أَيَحْسَبُ أَنْ لَمْ يَرَهُ أَحَدٌ7
ఏమిటి? తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా?
90:8జుజ్ 30 · పు. 594
أَلَمْ نَجْعَلْ لَهُ عَيْنَيْنِ8
ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా?
90:9జుజ్ 30 · పు. 594
وَلِسَانًا وَشَفَتَيْنِ9
మరియు నాలుకను మరియు రెండు పెదవులను.
90:10జుజ్ 30 · పు. 594
وَهَدَيْنَاهُ النَّجْدَيْنِ10
మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.
90:11జుజ్ 30 · పు. 594
فَلَا اقْتَحَمَ الْعَقَبَةَ11
కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు!
90:12జుజ్ 30 · పు. 594
وَمَا أَدْرَاكَ مَا الْعَقَبَةُ12
మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా?
90:13జుజ్ 30 · పు. 594
فَكُّ رَقَبَةٍ13
అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం.
90:14జుజ్ 30 · పు. 594
أَوْ إِطْعَامٌ فِي يَوْمٍ ذِي مَسْغَبَةٍ14
లేదా! (స్వయంగా) ఆకలి గొని ఉన్న రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం.
90:15జుజ్ 30 · పు. 594
يَتِيمًا ذَا مَقْرَبَةٍ15
సమీప అనాథునికి గానీ;
90:16జుజ్ 30 · పు. 594
أَوْ مِسْكِينًا ذَا مَتْرَبَةٍ16
లేక, దిక్కులేని నిరుపేదకు గానీ!
90:17జుజ్ 30 · పు. 594
ثُمَّ كَانَ مِنَ الَّذِينَ آمَنُوا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ17
మరియు విశ్వసించి, సహనాన్ని బోధించేవారిలో! మరియు కరుణను ఒకరి కొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం.
90:18జుజ్ 30 · పు. 594
أُولَٰئِكَ أَصْحَابُ الْمَيْمَنَةِ18
ఇలాంటి వారే కుడిపక్షం వారు.
90:19జుజ్ 30 · పు. 595
وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا هُمْ أَصْحَابُ الْمَشْأَمَةِ19
ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందినవారు.
90:20జుజ్ 30 · పు. 595
عَلَيْهِمْ نَارٌ مُؤْصَدَةٌ20
వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది.