సూరా 9 · జుజ్ 11

At-Tawbah · 9:93

۞ إِنَّمَا السَّبِيلُ عَلَى الَّذِينَ يَسْتَأْذِنُونَكَ وَهُمْ أَغْنِيَاءُ ۚ رَضُوا بِأَنْ يَكُونُوا مَعَ الْخَوَالِفِ وَطَبَعَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَعْلَمُونَ

కాని వాస్తవానికి ధనవంతులై కూడా, వెనుక కూర్చున్న వారితో ఉండటానికి ఇష్టపడి, నిన్ను అనుమతి అడిగే వారిపై తప్పక నింద గలదు. అల్లాహ్ వారి హృదయాల మీద ముద్ర వేసి ఉన్నాడు, కావున (తాము పోగొట్టుకునేదేమిటో) వారికి తెలియదు.

తఫ్సీర్

ఎప్పుడైతే అల్లాహ్ సాకులు కలిగిన వారికి శిక్షించటానికి ఎటువంటి దారి లేదని స్పష్టపరిచాడో యాతనకు ,శిక్షకు అర్హుడు ఎవరో ప్రస్తావించాడు.అయితే ఆయన ఇలా పలికాడు : ఓ ప్రవక్తా ప్రయాణపు వాహనమును సమకూర్చుకునే స్థోమత కలిగి ఉండి కూడా యుద్ధము నుండి వెనుక ఉండి పోయే విషయంలో మీతో అనుమతి కోరుతున్న వారందరూ వెనుక ఉండిపోయే వారితో ఇండ్లలో ఉండిపోయారు.ఈ విధంగా వారు స్వయంగా పరాభవమును,అవమానమును ఇష్టపడ్డారు.మరియు అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేశాడు.అవి హితబోధన ద్వారా ప్రభావితం కావు.మరియు వారు ఈ ముద్ర వలన తమకు ప్రయోజనం ఉన్నవాటిని ఎంచుకోవటమూ మరియు నష్టము ఉన్నవాటి నుండి బయటపడటానికి తెలుసుకోలేరు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి