సూరా 9 · జుజ్ 10

At-Tawbah · 9:91

لَيْسَ عَلَى الضُّعَفَاءِ وَلَا عَلَى الْمَرْضَىٰ وَلَا عَلَى الَّذِينَ لَا يَجِدُونَ مَا يُنْفِقُونَ حَرَجٌ إِذَا نَصَحُوا لِلَّهِ وَرَسُولِهِ ۚ مَا عَلَى الْمُحْسِنِينَ مِنْ سَبِيلٍ ۚ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ

బలహీనులు మరియు వ్యాధిగ్రస్తులు మరియు ప్రయాణపు ఖర్చులు లేనివారు, ఒకవేళ అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు వాస్తవానికి విశ్వాసపాత్రులై ఉంటే వారిపై (జిహాద్ కు వెళ్ళకుంటే) ఎలాంటి నిందలేదు. సజ్జనులపై కూడా ఎలాంటి నిందలేదు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

తఫ్సీర్

స్త్రీల పై,పిల్లల పై,వ్యాధిగ్రస్తుల పై,వృద్ధుల పై,ప్రయాణ వాహనమును సమకూర్చుకోవటం కోసం ఖర్చు చేయవలసిన ధనము లేని పేదవారి పై ఎటువంటి దోషము లేదు. (యుద్ధము కొరకు) బయలుదేరటం నుండి వెనుక ఉండటంలో వీరందరి పై ఎటువంటి పాపము లేదు ఎందుకంటే వారు ఎప్పుడైతే అల్లాహ్ కొరకు,ఆయన ప్రవక్త కొరకు చిత్తశుద్ధిని చూపి వారు ఆయన ధర్మము పై అమలు చేశారో వారి సాకులు ఉనికిలో ఉన్నాయి.ఈ సాకులు కలిగిన సజ్జనులపై శిక్షను కలిగించటానికి ఎటువంటి మార్గము లేదు.మరియు అల్లాహ్ సజ్జనుల పాపములను మన్నించే వాడును,వారిపై కనికరించేవాడును.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి