సూరా 9 · జుజ్ 10
At-Tawbah · 9:81
فَرِحَ الْمُخَلَّفُونَ بِمَقْعَدِهِمْ خِلَافَ رَسُولِ اللَّهِ وَكَرِهُوا أَنْ يُجَاهِدُوا بِأَمْوَالِهِمْ وَأَنْفُسِهِمْ فِي سَبِيلِ اللَّهِ وَقَالُوا لَا تَنْفِرُوا فِي الْحَرِّ ۗ قُلْ نَارُ جَهَنَّمَ أَشَدُّ حَرًّا ۚ لَوْ كَانُوا يَفْقَهُونَ
(తబూక్ దండయాత్రకు పోకుండా) వెనుక ఆగిపోయిన వారు, తాము అల్లాహ్ సందేశహరుని వెంట వెళ్ళటాన్ని నిరోధించి (తమ ఇండ్లలో) కూర్చుండి నందుకు సంతోషపడ్డారు. మరియు వారు తమ ధనసంపత్తులతో మరియు తమ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడటాన్ని అసహ్యించుకున్నారు. మరియు వారు ఇతరులతో: "ఈ తీవ్రమైన వేడిలో వెళ్ళకండి!" అని అన్నారు. వారితో అను: "భగభగ మండే నరకాగ్ని దీని కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది." అది వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది!
తఫ్సీర్
తబూక్ యుద్థము నుండి వెనుక ఉండిపోయిన కపటులు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహహు అలైహి వసల్లం వెళ్ళిన తరువాత అల్లాహ్ మార్గములో పోరాడటము నుండి తమ కూర్చోవటం పై సంతోషబడిపోయారు.విశ్వాసపరులు పోరాడినట్లు అల్లాహ్ మార్గములో తమ సంపదల ద్వారా,తమ ప్రాణాల ద్వారా పోరాడటంను ఇష్టపడలేదు.మరియు వారు తమ కపట సోధరులను ఆపుతూ ఇలా పలికారు : మీరు తీవ్రమైన ఎండలో వెళ్శకండి.తబూక్ యుద్ధము ఎండాకాలములో జరిగింది.ఓ ప్రవక్తా వారితో అనండి : కపటులు నిరీక్షిస్తున్న నరకాగ్ని వారు పారిపోయిన ఈ ఎండ కన్నా ఎంతో తీవ్రమైనది ఒక వేళ వారు తెలుసుకుంటే ఎంతో బాగుండేది.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి