సూరా 9 · జుజ్ 10

At-Tawbah · 9:64

يَحْذَرُ الْمُنَافِقُونَ أَنْ تُنَزَّلَ عَلَيْهِمْ سُورَةٌ تُنَبِّئُهُمْ بِمَا فِي قُلُوبِهِمْ ۚ قُلِ اسْتَهْزِئُوا إِنَّ اللَّهَ مُخْرِجٌ مَا تَحْذَرُونَ

తమ హృదయాలలో ఉన్న (రహస్యాలను) స్పష్టంగా తెలియజేసేటటు వంటి సూరహ్ వారికి విరుద్ధంగా అవతరింప జేయబడుతుందేమోనని, ఈ కపట విశ్వాసులు భయపడుతున్నారు. వారితో అను: "మీరు ఎగతాళి చెయ్యండి, మీరు (బయట పడుతుందని) భయపడుతున్న విషయాన్ని, అల్లాహ్ తప్పక బయటపెడ్తాడు."

తఫ్సీర్

తమ హృదయాల్లో దాచిన అవిశ్వాసమును విశ్వాసపరులకు తెలియజేసే ఏదైన సూరహ్ ను అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేస్తాడని కపట విశ్వాసులు భయపడేవారు. ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ కపట విశ్వాసులారా మీరు ధర్మ విషయంలో మీ హేళన చేయటంలో,మీ చెడు ప్రస్తావనలో ఉండండి,అల్లాహ్ మీరు దేని గురించి భయపడుతున్నారో సూరహ్ అవతరణ చేయటం ద్వారా లేదా దాన్ని తన ప్రవక్తకు తెలియ పరచటం ద్వారా బయట పెడుతాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి