సూరా 9 · జుజ్ 10
At-Tawbah · 9:6
وَإِنْ أَحَدٌ مِنَ الْمُشْرِكِينَ اسْتَجَارَكَ فَأَجِرْهُ حَتَّىٰ يَسْمَعَ كَلَامَ اللَّهِ ثُمَّ أَبْلِغْهُ مَأْمَنَهُ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَا يَعْلَمُونَ
మరియు బహుదైవారాధకులలో (ముష్రికీన్ లలో) ఎవడైనా నీ శరణు కోరితే - అతడు అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) వినటానికి - అతడికి శరణు ఇవ్వు. తరువాత అతడిని, అతడి కొరకు సురక్షితమైన స్థలానికి చేర్చు. ఇది ఎందుకంటే! వాస్తవానికి, వారు (సత్యం) తెలియని ప్రజలు.
తఫ్సీర్
ఒకవేళ ముష్రికుల్లోంచి ఎవడైన రక్తము,ధనము అనుమతించే (సమ్మతించే) ప్రాంతములో ప్రవేసించి ఓ ప్రవక్తా మీతో రక్షణను కోరితే అతడు ఖుర్ఆన్ వినేంత వరకు అతడి కోరికను స్వీకరంచండి.ఆ తరువాత అతడిని అతని సురక్షిత ప్రదేశమునుకు చేరవేయండి.ఇది ఎందుకంటే అవిశ్వాసపరులు ఈ ధర్మ వాస్తవాలు తెలియని వారు.వారు ఖుర్ఆన్ ను వినటం వలన వాటిని తెలుసుకున్నప్పుడు సన్మార్గం పొందవచ్చును.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి