సూరా 9 · జుజ్ 10
At-Tawbah · 9:41
انْفِرُوا خِفَافًا وَثِقَالًا وَجَاهِدُوا بِأَمْوَالِكُمْ وَأَنْفُسِكُمْ فِي سَبِيلِ اللَّهِ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ
తేలికగానైనా సరే, బరువుగా నైనా సరే బయలుదేరండి. మరియు మీ సంపదలతో మరియు మీ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడండి. ఒకవేళ మీరిది తెలుసుకో గలిగితే, ఇది మీకెంతో ఉత్తమమైనది.
తఫ్సీర్
ఓ విశ్వాసపరులారా మీరు క్లిష్టమైన పరిస్థితుల్లో,సానుకూలమైన పరిస్థితుల్లో యవ్వనంలో,వృద్ధాప్యంలో అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం కొరకు బయలుదేరండి.మరియు మీరు మీ సంపదల ద్వారా,మీ ప్రాణాల ద్వారా పోరాడండి.నిశ్చయంగా ఆ బయలుదేరటం,సంపదలు,ప్రాణాల ద్వారా పోరాడటము యుద్ధం కొరకు బయలుదేరకుండా కూర్చోవటం,సంపదలు,ప్రాణాల భద్రతతో కొలువు తీరటం కన్న ఇహలోక జీవితంలో,పరలోక జీవితంలో చాలా ప్రయోజకరమైనది. ఒక వేళ మీరు దాన్ని తెలుసుకుంటే దానిపై ఆత్యాశ చూపండి.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి