సూరా 9 · జుజ్ 10

At-Tawbah · 9:36

إِنَّ عِدَّةَ الشُّهُورِ عِنْدَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنْفُسَكُمْ ۚ وَقَاتِلُوا الْمُشْرِكِينَ كَافَّةً كَمَا يُقَاتِلُونَكُمْ كَافَّةً ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ مَعَ الْمُتَّقِينَ

నిశ్చయంగా, నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర పన్నెండు నెలలు మాత్రమే. ఇది భూమ్యాకాశాలు సృష్టించిన దినం నుండి అల్లాహ్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. వాటిలో నాలుగు నిషిద్ధ (మాసాలు). ఇదే సరైన ధర్మం. కావున వాటిలో (ఆ నాలుగ హిజ్రీ మాసాలలో) మీకు మీరు అన్యాయం చేసుకోకండి. బహుదైవారాధకులతో (ముష్రికీన్ లతో) అందరూ కలిసి పోరాడండి. ఏ విధంగా అయితే వారందరూ కలిసి మీతో పోరాడుతున్నారో! మరియు నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గల వారితోనే ఉంటాడని తెలుసుకోండి.

తఫ్సీర్

నిశ్చయంగా సంవత్సరపు నెలల లెక్క అల్లాహ్ ఆదేశములో,ఆయన నిర్ణయంలో ఆయన మొదట భూమ్యాకాశాలను సృష్టించినప్పటి నుంచి లౌహె మహ్ఫూజ్ లో అల్లాహ్ పొందుపరచిన వాటిలో పన్నెండు కలదు.ఈ పన్నెండు నెలల్లోంచి నాలుగు నెలల్లో అల్లాహ్ వాటిలో యుద్ధం చేయటమును నిషేధించాడు.అవి మూడు వివరణగా (జులా ఖాదతి,జుల్ హిజ్జతి మరియు ముహర్రమ్) మరియు ఒకటి వేరుగా అది (రజబ్).ఈ ప్రస్తావించబడిన సంవత్సర నెలల లెక్క,వాటిలోంచి నాలుగింటి నిషేధము అదే సక్రమమైన ధర్మము.అయితే మీరు వాటిలో యుద్ధాలు చేసి,వాటిని అగౌరవపాలు చేసి ఈ నిషిద్ధమాసముల్లో మీపై హింసకు పాల్పడకండి.మరియు ఏ విధంగా నైతే ముష్రికులందరు కలిసి మీతో యుద్ధం చేస్తున్నారో ఆ విధంగా మీరందరు కలిసి ముష్రికులతో యుద్ధం చేయండి.మరియు అల్లాహ్ ఎవరైతే ఆయన ఆదేశాలను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయన భీతిని కలిగి ఉంటారో వారికి విజయమును కలిగించి,స్థిరత్వమును ప్రసాధించి తోడుగా ఉంటాడని మీరు తెలుసుకోండి.అల్లాహ్ ఎవరికి తోడుగా ఉంటాడో వారిపై ఎవరూ గెలవలేరు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి