సూరా 9 · జుజ్ 10

At-Tawbah · 9:26

ثُمَّ أَنْزَلَ اللَّهُ سَكِينَتَهُ عَلَىٰ رَسُولِهِ وَعَلَى الْمُؤْمِنِينَ وَأَنْزَلَ جُنُودًا لَمْ تَرَوْهَا وَعَذَّبَ الَّذِينَ كَفَرُوا ۚ وَذَٰلِكَ جَزَاءُ الْكَافِرِينَ

తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై మరియు విశ్వాసులపై ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. మరియు మీకు కనిపించని (దైవదూతల) దళాలను దింపి సత్యతిరస్కారులను శిక్షించాడు. మరియు ఇదే సత్యతిరస్కారులకు లభించే ప్రతిఫలం.

తఫ్సీర్

మీరు మీ శతృవుల ముందు నుండి పారిపోయిన తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై ప్రశాంతతను అవతరింపజేశాడు.మరియు దాన్ని విశ్వాసపరులపై అవతరింపజేశాడు.అయితే మీరు యుద్ధం కొరకు స్థిరత్వాన్ని ప్రదర్శించండి.మరియు ఆయన మీకు కనిపించని దైవదూతలను అవతరింపజేశాడు.మరియు ఆయన అవిశ్వాసపరులను వారికి సంభవించిన మరణము,బంధీ అవటం,సంపదలను స్వాధీనపరచుకోవటం,సంతానమును బానిసలుగా చేసుకోవటం లాంటి ద్వారా శిక్షించాడు.మరియు ఈ ప్రతిఫలం దేని ద్వారానైతే వీరందరూ పొందారో అది తమ ప్రవక్తను తిరస్కరించిన,ఆయన తీసుకుని వచ్చిన దాన్ని విముఖత చూపిన అవిశ్వాసపరుల ప్రతిఫలము.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి