సూరా 9 · జుజ్ 10

At-Tawbah · 9:24

قُلْ إِنْ كَانَ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ وَإِخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَالٌ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَاكِنُ تَرْضَوْنَهَا أَحَبَّ إِلَيْكُمْ مِنَ اللَّهِ وَرَسُولِهِ وَجِهَادٍ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّىٰ يَأْتِيَ اللَّهُ بِأَمْرِهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ

వారితో ఇలా అను: "మీ తండ్రితాతలు మీ కుమారులు, మీ సోదరులు, మీ సహవాసులు (అజ్వాజ్), మీ బంధువులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు, మందగిస్తాయేమోనని భయపడే మీ వ్యాపారాలు, మీకు ప్రీతికరమైన మీ భవనాలు - అల్లాహ్ కంటే, ఆయన ప్రవక్త కంటే మరియు ఆయన మార్గంలో పోరాడటం కంటే - మీకు ఎక్కువ ప్రియమైనవైతే, అల్లాహ్ తన తీర్పును బహిర్గతం చేసే వరకు నిరీక్షించండి. మరియు అల్లాహ్ అవిధేయులైన జాతి వారికి సన్మార్గం చూపడు."

తఫ్సీర్

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీ తాతముత్తాతలు,మీ కుమారులు,మీ సోదరులు,మీ భార్యలు,మీ బంధువులు,మీరు సంపాదించిన మీ సంపదలు, దేని వాడుకను (వ్వవహారమును) మీరు ఇష్టపడుతున్నారో,దేని మాంద్యము నుండి మీరు భయపడుతున్నారో మీ ఆ వ్యాపారము,వేటిలోనైతే మీరు ఉండటాన్ని ఇష్టపడుతున్నారో మీ ఆ గృహాలు ఒక వేళ ఇవన్నీ అల్లహ్ కన్న,ఆయన ప్రవక్త కన్న,ఆయన మార్గములో జిహాద్ కన్న మీకు అమితంగా ఇష్టమైతే అల్లాహ్ మీపై కురిపించే శిక్ష,యాతన కోసం నిరీక్షించండి.మరియు అల్లాహ్ తన విధేయత నుండి తొలిగిపోయే వారికి తాను ఇష్టపడే కార్యమును చేసే భాగ్యమును కలిగించడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి