సూరా 9 · జుజ్ 11
At-Tawbah · 9:115
وَمَا كَانَ اللَّهُ لِيُضِلَّ قَوْمًا بَعْدَ إِذْ هَدَاهُمْ حَتَّىٰ يُبَيِّنَ لَهُمْ مَا يَتَّقُونَ ۚ إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
మరియు ఒక జాతికి సన్మార్గం చూపిన తరువాత వారు దూరంగా ఉండవలసిన విషయాలను గురించి వారికి స్పష్టంగా తెలుపనంత వరకు, అల్లాహ్ వారిని మార్గభ్రష్టత్వంలో పడవేయడు. నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.
తఫ్సీర్
అల్లాహ్ ఒక జాతి వారిని సన్మార్గము యొక్క సౌభాగ్యమును కలిగించిన తరువాత,వారికి వారు దూరంగా ఉండవసిన నిషిద్ధమైన వాటిని స్పష్టపరచనంత వరకూ వారిని మార్గభ్రష్టతకు లోను చేయటానికి నిర్ణయించడు.ఒకవేళ వారు తమపై నిషేదించిన వాటిని వాటి నిషేదము గురించి స్పష్టమైన తరువాత పాల్పడితే వారిని మార్గభ్రష్టులుగా నిర్ణయిస్తాడు.నిశ్చయంగా అల్లాహ్ కు అన్నీ విషయాల గురించి బాగా తెలుసు,ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.వాస్తవానికి ఆయన మీకు తెలియని వాటిని మీకు నేర్పించాడు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి