సూరా 9 · జుజ్ 11
At-Tawbah · 9:101
وَمِمَّنْ حَوْلَكُمْ مِنَ الْأَعْرَابِ مُنَافِقُونَ ۖ وَمِنْ أَهْلِ الْمَدِينَةِ ۖ مَرَدُوا عَلَى النِّفَاقِ لَا تَعْلَمُهُمْ ۖ نَحْنُ نَعْلَمُهُمْ ۚ سَنُعَذِّبُهُمْ مَرَّتَيْنِ ثُمَّ يُرَدُّونَ إِلَىٰ عَذَابٍ عَظِيمٍ
మరియు మీ చుట్టుప్రక్కల ఉండే ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు కపట విశ్వాసులున్నారు. మరియు (ప్రవక్త) నగరం (మదీనా మునవ్వరా)లో కూడా (కపటవిశ్వాసులు) ఉన్నారు. వారు తమ కాపట్యంలో నాటుకొని ఉన్నారు. కాని (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఎరుగవు. మేము వారిని ఎరుగుతాము. మేము వారికి రెట్టింపు శిక్షను విధించగలము. తరువాత వారు ఘోరశిక్ష వైపుకు మరలింపబడతారు.
తఫ్సీర్
మదీన మునవ్వర దగ్గర ప్రాంతములో ఉన్న పల్లె వాసుల్లోంచి కపటులు,మదీన మునవ్వర వాసుల్లోంచి కపటులు కపటత్వముపై ఉండి దానిపై స్థిరత్వాన్ని ప్రదర్శిస్తే ఓ ప్రవక్తా మీరు వారిని గుర్తించలేరు.అల్లాహ్ వారిని గుర్తిస్తాడు.అల్లాహ్ వారిని తొందరలోనే రెండు సార్లు శిక్షిస్తాడు.ఒక సారి ఇహలోకంలోనే వారి కపటత్వమును బహిర్గతం చేసి,వారిని హతమార్చి,వారిని బందీలుగా చేసి,ఇంకొక సారి పరలోకములో సమాది శిక్ష ద్వారా,ఆ పిదప వారు ప్రళయదినాన నరకాగ్నిలో అట్టడుగు స్థానములో పెద్దశిక్ష వైపునకు మరలించబడుతారు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి