సూరా 7 · జుజ్ 8
Al-A'raf · 7:86
وَلَا تَقْعُدُوا بِكُلِّ صِرَاطٍ تُوعِدُونَ وَتَصُدُّونَ عَنْ سَبِيلِ اللَّهِ مَنْ آمَنَ بِهِ وَتَبْغُونَهَا عِوَجًا ۚ وَاذْكُرُوا إِذْ كُنْتُمْ قَلِيلًا فَكَثَّرَكُمْ ۖ وَانْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِينَ
మరియు ఆయనను విశ్వసించిన వారిని, అల్లాహ్ మార్గం నుండి నిరోధించటానికి వారిని బెదరిస్తూ, అది వక్రమమైనదని చూపగోరి ప్రతి మార్గంలో కూర్చోకండి. మీరు అల్పసంఖ్యలో ఉన్నప్పుడు ఆయన మీ సంఖ్యను అధికం చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు కల్లోలం రేకెత్తించిన వారి గతి ఏమయిందో చూడండి.
తఫ్సీర్
ప్రజలు నడిచే మార్గాల్లో వారి సంపదను దోచుకోవటానికి (కాజేయటానికి),అల్లాహ్ ధర్మము మార్గమును పొందాలని ఆశించిన వారిని ఆల్లాహ్ ధర్మము నుండి ఆపటానికి అల్లాహ్ మార్గము వక్రంగా తయారై ప్రజలు దానిపై నడవటానికి వీలు కాకుండా ఉండటాన్ని ఆశిస్తు బెదిరించటానికి కూర్చోకండి. మరియు మీరు అల్లాహ్ యొక్క అనుగ్రహాలపై ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవటం కొరకు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేసుకోండి. మీ సంఖ్య బలం తక్కువగా ఉండేది ఆయన మిమ్మల్ని అధికం చేశాడు. మీకన్నా ముందు భూమిలో అల్లకల్లోలాను సృష్టించే వారి పరిణామం ఏమయిందో ఆలోచించండి. నిశ్చయంగా వారి పరిణామం వినాశనము,అధ్వానము.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి