సూరా 7 · జుజ్ 8

Al-A'raf · 7:81

إِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ شَهْوَةً مِنْ دُونِ النِّسَاءِ ۚ بَلْ أَنْتُمْ قَوْمٌ مُسْرِفُونَ

"వాస్తవానికి, మీరు స్త్రీలను వదలి కామంతో పురుషుల వద్దకు పోతున్నారు. వాస్తవంగా, మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు.

తఫ్సీర్

నిశ్చయంగా మీరు కామ కోరికలు తీర్చుకోవటానికి సృష్టించబడ్డ స్త్రీలను వదిలి మగవారి వద్దకు వస్తున్నారు. మీ ఈ చర్యలో మీరు మీ బుద్దిని కాని, దైవాదేశాలను కాని. స్వభావమును కాని అనుసరించ లేదు. కాని మీరు మానవ నియంత్రణ పరిమితి నుండి బయటకు రావటం ద్వారా,ఆరోగ్యకరమైన మనస్సులకు,ఉన్నతమైన ప్రవృత్తికి అవసరమైన దాని నుండి మీరు నిష్క్రమించటం ద్వారా మీరు అల్లాహ్ హద్దులను (పరిమితులను) మించిపోయారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి