సూరా 7 · జుజ్ 8

Al-A'raf · 7:77

فَعَقَرُوا النَّاقَةَ وَعَتَوْا عَنْ أَمْرِ رَبِّهِمْ وَقَالُوا يَا صَالِحُ ائْتِنَا بِمَا تَعِدُنَا إِنْ كُنْتَ مِنَ الْمُرْسَلِينَ

ఆ తరువాత వారు ఆ ఆడఒంటె వెనుక కాలి మోకాలి పెద్దనరం కోసి (చంపి), తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, అతనితో అన్నారు: "ఓ సాలిహ్! నీవు నిజంగానే సందేశహరుడవైతే నీవు మమ్మల్ని బెదిరించే, ఆ శిక్షను తీసుకురా!"

తఫ్సీర్

అయితే ఏ ఒంటెనైతే బాధపెట్టే ఉద్దేశంతో తాకవద్దని ఆయన వారించాడో అల్లాహ్ ఆదేశమును పాటించటం నుండి వారు తలబిరుసుతనం ప్రదర్శిస్తు చంపివేశారు. మరియు సాలిహ్ అలైహిస్సలాం వారిని దేని గురించి బెదిరించారో దానిని దూరంగా భావిస్తూ,ఎగతాళి చేస్తూ ఇలా పలికారు : ఓ సాలిహ్ నీవు నిజంగా అల్లాహ్ ప్రవక్తవైతే ఏ బాధాకరమైన శిక్ష గురించి మమ్మల్ని బెదిరించావో దానిని మా వద్దకు తీసుకుని రా.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి