సూరా 7 · జుజ్ 8
Al-A'raf · 7:57
وَهُوَ الَّذِي يُرْسِلُ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ ۖ حَتَّىٰ إِذَا أَقَلَّتْ سَحَابًا ثِقَالًا سُقْنَاهُ لِبَلَدٍ مَيِّتٍ فَأَنْزَلْنَا بِهِ الْمَاءَ فَأَخْرَجْنَا بِهِ مِنْ كُلِّ الثَّمَرَاتِ ۚ كَذَٰلِكَ نُخْرِجُ الْمَوْتَىٰ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
మరియు ఆయనే తన కారుణ్యానికి ముందు శుభవార్తలు తెచ్చే వాయువులను పంపేవాడు. ఎప్పుడైతే అవి బరువైన మేఘాలను ఎత్తుకొని వస్తాయో మేము వాటిని నిర్జీవమైన నగరాల వైపునకు తీసుకొని పోయి వాటి నుండి నీటిని కురిపిస్తాము. ఆ నీటి వలన పలు విధాలైన ఫలాలను ఉత్పత్తి చేస్తాము. ఇదే విధంగా మేము మృతులను కూడా లేపుతాము; ఈ విధంగానైనా మీరు హితబోధ స్వీకరిస్తారని!
తఫ్సీర్
మరియు అల్లాహ్ సుబహానహు వ తఆలా ఆయనే గాలులను వర్షముల ద్వారా శుభవార్తను ఇస్తూ పంపిస్తాడు. ఆఖరికి గాలులు నీటితో బరువెక్కిన మేఘాలను ఎత్తుకున్నప్పుడు మేము ఆ మేఘాలను నిర్జీవమైన ఏదైన ప్రదేశం వైపునకు మరలిస్తాము. ఆ తరువాత మేము ఆ ప్రదేశం పై నీటిని కురిపిస్తాము. ఆ నీటి ద్వారా అన్ని రకాల ఫలాలను వెలికి తీస్తాము. ఫలాలను వెలికి తీసిన విధంగా అదే రూపములో మేము మృతులను వారి సమాదుల నుండి జీవింపజేసి వెలికి తీస్తాము. ఓ ప్రజలారా అల్లాహ్ యొక్క శక్తి సామర్ధ్యాలను,అపూర్వమైన ఆయన పనితనమును ఆయన మృతులను జీవింప చేయటంలో సామర్ధ్యం కలవాడని మీరు గుర్తిస్తారని మేము ఈ విధంగా చేశాము.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి