సూరా 7 · జుజ్ 8

Al-A'raf · 7:38

قَالَ ادْخُلُوا فِي أُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِكُمْ مِنَ الْجِنِّ وَالْإِنْسِ فِي النَّارِ ۖ كُلَّمَا دَخَلَتْ أُمَّةٌ لَعَنَتْ أُخْتَهَا ۖ حَتَّىٰ إِذَا ادَّارَكُوا فِيهَا جَمِيعًا قَالَتْ أُخْرَاهُمْ لِأُولَاهُمْ رَبَّنَا هَٰؤُلَاءِ أَضَلُّونَا فَآتِهِمْ عَذَابًا ضِعْفًا مِنَ النَّارِ ۖ قَالَ لِكُلٍّ ضِعْفٌ وَلَٰكِنْ لَا تَعْلَمُونَ

(అల్లాహ్) అంటాడు: "మీకు పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవుల సమాజాలు పోయి చేరిన ఆ నరకాగ్నిలోకి ప్రవేశించండి." ప్రతి సమాజం (నరకంలో) ప్రవేశించినపుడు తన పూర్వపు వారిని (సమాజాన్ని) శపిస్తుంది. తుదకు వారంతా అక్కడ చేరిన పిదప; తరువాత వచ్చిన వారు తమ కంటే ముందు వచ్చని వారిని గురించి: "ఓ మా ప్రభూ! వీరే మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసినవారు, కావున వీరికి రెట్టింపు నరకాగ్ని శిక్ష విధించు!" అని అంటారు. దానికి (అల్లాహ్): "ప్రతి వాడికి రెట్టింపు (శిక్ష) విధించబడుతుంది. కాని మీరది తెలుసుకోలేరు!" అని అంటాడు.

తఫ్సీర్

వారితో దైవదూతలు ఇలా అంటారు ఓ ముష్రికులారా : మీరు మీకన్న పూర్వం జిన్నాతుల్లోంచి,మానవుల్లోంచి అవిశ్వాసంలో,అపమార్గంలో ఉండి గతించిన వారందరితో నరకాగ్నిలో ప్రవేశించండి. సమూహాల్లోంచి ఏదైన సమూహం ప్రవేశించినప్పుడు తమ కన్న ముందు ప్రవేశించిన సహవాస సమూహముపై శాపనార్ధాలు పెడుతుంది. ఆఖరికి వారందరు అందులో కలిసిపోయిన తరువాత వారందరూ సమావేశమై వారిలోని తరువాత ప్రవేశించిన వారు అంటే క్రింది వారు,అనుసరించని వారు వారిలోని మొదటివారు అంటే పెద్ద వారు,నాయకులను ఉద్దేశించి ఇలా అంటారు : ఓ మా ప్రభువా ఈ పెద్దవారందరే మమ్మల్ని సన్మార్గము నుంచి తప్పించినారు. అప మార్గమును మాకు అలంకరించి చూపించినందుకు వారికి రెట్టింపు శిక్షను విధించు. అల్లాహ్ వారిని ఖండిస్తూ ఇలా అంటాడు : మీలో నుంచి ప్రతి సమూహానికి రెట్టింపు శిక్ష నుండి భాగముంటుంది. కాని అది మీకు అర్ధం కాదు. దానిని మీరు తెలుసుకోలేరు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి