సూరా 7 · జుజ్ 8

Al-A'raf · 7:31

۞ يَا بَنِي آدَمَ خُذُوا زِينَتَكُمْ عِنْدَ كُلِّ مَسْجِدٍ وَكُلُوا وَاشْرَبُوا وَلَا تُسْرِفُوا ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْرِفِينَ

ఓ ఆదమ్ సంతానమా ప్రతి మస్జిదులో (నమాజ్ లో) మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి, కాని మితిమీరకండి. నిశ్చయంగా, ఆయన (అల్లాహ్) మితిమీరే వారిని ప్రేమించడు.

తఫ్సీర్

ఓ ఆదం సంతతివారా మీ మర్మావయవాలను కప్పే వస్త్రములను,నమాజు,ప్రదక్షణ సమయంలో పరిశుభ్రమైన,పరిశుద్దమైనవి మీరు అందమును పొందే వస్త్రాలను మీరు తొడగండి. అల్లాహ్ హలాల్ చేసిన పరిశుద్ధ వస్తువుల్లోంచి మీరు కోరుకున్న వాటిని తినండి,త్రాగండి. ఈ విషయంలో నియంత్రణ పరిమితిని మించకండి. హలాల్ ను వదిలి హరాం వైపునకు వెళ్ళకండి. నిశ్చయంగా నియంత్రణ పరిమితులను మించిపోయే వారిని అల్లాహ్ ఇష్టపడడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి