సూరా 7 · జుజ్ 9
Al-A'raf · 7:190
فَلَمَّا آتَاهُمَا صَالِحًا جَعَلَا لَهُ شُرَكَاءَ فِيمَا آتَاهُمَا ۚ فَتَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ
ఆయన వారికి ఒక మంచి బిడ్డను ప్రసాదించిన పిదప వారు, ఆయన ప్రసాదించిన దాని విషయంలో ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించసాగుతారు. కాని వారు కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్ మహోన్నతుడు.
తఫ్సీర్
అల్లాహ్ వారిద్దరి దుఆను స్వీకరించి వారిద్దరు దుఆ చేసినట్లే వారికి ఏ లోపము లేని సంతానమును ప్రసాదించినప్పుడు వారికి ప్రసాదించిన దానిలో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించారు. తమ కుమారుడిని ఇతరులకు పూజించారు. మరియు వారు అతనికి అబ్దుల్ హారిస్ అని పేరు పెట్టారు. అయితే అల్లాహ్ భాగస్వామ్య చేష్టలన్నింటి నుండి అతీతుడు,పరిశుద్ధుడు.ఉలూహియత్,రుబూబియత్ లో ఆయన ఒక్కడే.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి