సూరా 7 · జుజ్ 9

Al-A'raf · 7:185

أَوَلَمْ يَنْظُرُوا فِي مَلَكُوتِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا خَلَقَ اللَّهُ مِنْ شَيْءٍ وَأَنْ عَسَىٰ أَنْ يَكُونَ قَدِ اقْتَرَبَ أَجَلُهُمْ ۖ فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ

ఏమీ? వారు భూమ్యాకాశాలపై గల (అల్లాహ్) ఆధిపత్యాన్ని మరియు అల్లాహ్ సృష్టించిన ప్రతివస్తువును గమనించి చూసి, బహుశా తమ గడువు కూడా సమీపించిందేమోనని అనుకోలేరా? దీని తరువాత వారు మరేవిధమైన సందేశాన్ని విశ్వసిస్తారు?

తఫ్సీర్

మరియు వారందరు భూమిలో,ఆకాశములో ఉన్న అల్లాహ్ యొక్క రాజ్యాధికారము వైపునకు గుణపాఠం నేర్చుకునే దృష్టితో ఎందుకు చూడటం లేదు ?. మరియు వాటిలో అల్లాహ్ సృష్టించిన జంతువులను,వృక్షాలను ఇతరత్రా వాటి వైపునకు ఎందుకు చూడటం లేదు ?. సమయం దాటక ముందే పశ్చాత్తాప్పడటానికి తమ సమయాల ముగింపు దగ్గర పడి ఉండవచ్చని ఎందుకు వాటి వైపు చూడటం లేదు ?. అయితే వారు ఖుర్ఆన్ ను,అందులో ఉన్న వాగ్ధానమును,హెచ్చరికను విశ్వసించనప్పుడు దానిని కాకుండా వేరే ఏ గ్రంధాన్ని విశ్వసిస్తారు ?.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి