సూరా 7 · జుజ్ 9

Al-A'raf · 7:182

وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا سَنَسْتَدْرِجُهُمْ مِنْ حَيْثُ لَا يَعْلَمُونَ

మరియు మా సూచనలను అబద్ధాలని తిరస్కరించేవారిని, మేము వారికి తెలియకుండానే క్రమక్రమంగా (నాశనం వైపునకు) తీసుకుపోతాము.

తఫ్సీర్

మరియు ఎవరైతే మన ఆయతులను తిరస్కరిస్తారో,వాటిని విశ్వసించరో అంతే కాకుండా వాటిని నిరాకరిస్తారో వారి కొరకు మేము తొందరలోనే ఆహారోపాధి ద్వారాలను వారికి గౌరవప్రదంగా కాకుండా వారిని వారు ఉన్న మార్గ భ్రష్టతలో ఇంకా పెరిగిపోయే వరకు క్రమక్రమంగా బిగుసుపోయే వరకు తెరుస్తాము. మరల వారు పరధ్యానంలో ఉన్నప్పుడు మా శిక్ష వారిపై వచ్చి పడుతుంది.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి