సూరా 7 · జుజ్ 9
Al-A'raf · 7:180
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا ۖ وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَائِهِ ۚ سَيُجْزَوْنَ مَا كَانُوا يَعْمَلُونَ
మరియు అల్లాహ్ పేర్లు! అన్నీ అత్యుత్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి. మరియు ఆయన పేర్ల విషయంలో సత్యం నుండి వైదొలగిన వారిని విసర్జించండి. వారు తమ కర్మలకు ప్రతిఫలం పొందగలరు.
తఫ్సీర్
అల్లాహ్ కొరకు ఆయన గొప్పతనమును,ఆయన పరిపూర్ణతను సూచించే మంచి మంచి పేర్లు కలవు. వాటి ద్వారా మీరు కోరుకుంటున్న వాటిని అడుగుతూ అల్లాహ్ తో వేడుకోండి. వాటి ద్వారా ఆయన్ను పొగడండి. మరియు ఈ నామములను అల్లాహేతరుల కొరకు చేసి,లేదా వాటిని ఆయన నుండి నిరాకరించి లేదా వాటి అర్ధాన్ని మార్చి లేదా వాటి ద్వారా ఆయనను వదిలి వేరే వారికి పోల్చి వాటి విషయంలో విముఖత చూపే వారిని మీరు వదిలి వేయండి. వాటి ద్వారా సత్యము నుండి విముఖత చూపే వీరందరికి మేము తొందరలోనే వారు చేసిన కార్యాలకు ప్రతిఫలంగా బాధాకరమైన శిక్షను ప్రసాదిస్తాము.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి