సూరా 7 · జుజ్ 9
Al-A'raf · 7:170
وَالَّذِينَ يُمَسِّكُونَ بِالْكِتَابِ وَأَقَامُوا الصَّلَاةَ إِنَّا لَا نُضِيعُ أَجْرَ الْمُصْلِحِينَ
మరియు ఎవరైతే గ్రంథాన్ని స్థిరంగా అనుసరిస్తారో మరియు నమాజ్ స్థాపిస్తారో, అలాంటి సద్వర్తనుల ప్రతిఫలాన్ని నిశ్చయంగా మేము వ్యర్థం చేయము.
తఫ్సీర్
మరియు ఎవరైతే గ్రంధంపై పట్టు కలిగి ఉన్నారో,అందులో ఉన్న వాటన్నింటిని ఆచరిస్తారో,నమాజులను వాటి వేళలను,వాటి షరతులను,వాటి అనివార్య కార్యాలను,వాటి సున్నతులను పరిరక్షిస్తూ పాటిస్తారో వారందరిని తొందరలోనే అల్లాహ్ వారి ఆచరణల పరంగా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. అయితే అల్లాహ్ పుణ్యపరంగా ఉండే ఆచరణ కలిగిన వారి ప్రతిఫలాన్ని వృధా చేయడు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి