సూరా 7 · జుజ్ 9

Al-A'raf · 7:157

الَّذِينَ يَتَّبِعُونَ الرَّسُولَ النَّبِيَّ الْأُمِّيَّ الَّذِي يَجِدُونَهُ مَكْتُوبًا عِنْدَهُمْ فِي التَّوْرَاةِ وَالْإِنْجِيلِ يَأْمُرُهُمْ بِالْمَعْرُوفِ وَيَنْهَاهُمْ عَنِ الْمُنْكَرِ وَيُحِلُّ لَهُمُ الطَّيِّبَاتِ وَيُحَرِّمُ عَلَيْهِمُ الْخَبَائِثَ وَيَضَعُ عَنْهُمْ إِصْرَهُمْ وَالْأَغْلَالَ الَّتِي كَانَتْ عَلَيْهِمْ ۚ فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنْزِلَ مَعَهُ ۙ أُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ

"ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్యరాస్యుడైన ఈ ప్రవక్తను అనుసరిస్తారో! ఎవరి ప్రస్తావన వారి వద్ద వున్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో, అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్భంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అతవరింపజేయబడిన జ్యోతిని అనుసరించే వారు మాత్రమే సాఫల్యం పొందేవారు."

తఫ్సీర్

ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అనుసరిస్తున్నారో ఆయన వ్రాయలేని,చదవలేని నిరక్షరాసి. ఆయనపై ఆయన ప్రభువు దైవ వాణిని మాత్రమే అవతరింప చేస్తాడు. ఆయన నామమును,ఆయన గుణాలను,ఆయనపై అవతరింపబడిన దానిని వారు మూసాపై అవతరింపబడిన తౌరాతులో,ఈసాపై అవతరింపబడిన ఇంజీలులో లిఖిత పూర్వకంగా పొందుతారు,దేని మంచి గురించినైతే,మేలు గురించినైతే తెలుస్తుందో దాని గురించే వారికి ఆదేశిస్తాడు. మంచి మనసుల్లో,స్వఛ్ఛమైన స్వభావముల్లో చెడుగా గర్తింపు ఉన్న వాటి నుండి వారిని వారిస్తాడు. అభిరుచులను ఎటువంటి నష్టం లేని తినే వస్తువుల్లోంచి,త్రాగే వస్తువుల్లోంచి,స్త్రీల్లోంచి వారి కొరకు అనుమతినిస్తున్నాడు. వాటిలోంచి అశుధ్దమైన వాటిని వారిపై నిషేధిస్తున్నాడు. వారిపై మోయబడిన కష్టమైన బాధలను తొలగిస్తాడు హత్య చేసిన వాడిని హతమార్చడం అనివార్యమవటం లాంటి ఆ హత్య కావాలని చేసిన,అనుకోకుండా చేసిన. అయితే ఎవరైతే ఇస్రాయీలు సంతతి వారిలో నుండి,ఇతరుల్లో నుండి ఆయనను విశ్వసిస్తారో,ఆయనను గౌరవిస్తారో,ఆయన పెద్దరికాన్ని తెలుపుతారో ఆయన్ని వ్యతిరేకించే సత్యతిరస్కారులకు వ్యతిరేకంగా ఆయనకు సహాయం చేస్తారో,సన్మార్గమును చూపే వెలుగుగా ఆయనపై అవతరింపబడిన ఖుర్ఆన్ ను అనుసరిస్తారో వారందరు తాము ఆశించిన వాటిని పొందుతూ తాము భయపడే దాని నుండి పరిరక్షింపబడి సాఫల్యం చెందుతారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి