సూరా 7 · జుజ్ 9

Al-A'raf · 7:144

قَالَ يَا مُوسَىٰ إِنِّي اصْطَفَيْتُكَ عَلَى النَّاسِ بِرِسَالَاتِي وَبِكَلَامِي فَخُذْ مَا آتَيْتُكَ وَكُنْ مِنَ الشَّاكِرِينَ

(అల్లాహ్) అన్నాడు: "ఓ మూసా ప్రవక్త పదవికి మరియు సంభాషించటానికి - నిశ్చయంగా, నేను ప్రజలందరిలో, నిన్ను ఎన్నుకున్నాను. కావున నేను నీకిచ్చిన దానిని తీసుకొని, కృతజ్ఞులలో చేరు."

తఫ్సీర్

అల్లాహ్ మూసాతో ఇలా పలికాడు : ఓ మూసా నేను నిన్ను ప్రజల వద్దకు ప్రవక్తగా పంపించిన వేళ నేను నిన్ను నా సందేశాల ద్వారా జనులపై ప్రాధాన్యతను ఇచ్చాను,నిన్ను ఎన్నుకున్నాను. మరియు ఎటువంటి మూలాధారము లేకుండా నీతో నా సంభాషణ ద్వారా నేను నీకు ప్రాధాన్యతను ప్రసాదించాను. కాబట్టి నీవు నేను నీకు ప్రసాదించిన ఈ గౌరవ మర్యాదలను పుచ్చుకో,ఈ గొప్ప బహుమానము పై నీవు అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకునే వారిలో అయిపో.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి