సూరా 7 · జుజ్ 9
Al-A'raf · 7:140
قَالَ أَغَيْرَ اللَّهِ أَبْغِيكُمْ إِلَٰهًا وَهُوَ فَضَّلَكُمْ عَلَى الْعَالَمِينَ
(మూసా ఇంకా) ఇలా అన్నాడు: "ఏమీ? నేను అల్లాహ్ ను వదలి మరొక ఆరాధ్యదైవాన్ని మీ కొరకు అన్వేషించాలా? వాస్తవానికి ఆయనే (మీకాలపు) సర్వలోకాల వారిపై మీకు ఘనతను ప్రసాదించాడు కదా!"
తఫ్సీర్
మూసా తన జాతివారితో ఇలా పలికారు ఓ నా జాతివారా : మీరు ఆరాధించటానికి మీ కొరకు అల్లాహ్ ను కాదని వేరే ఆరాధ్య దైవమును నేను ఎలా కోరుకుంటాను ?. వాస్తవానికి మీరు ఆయన యొక్క గొప్ప మహిమలను చూశారు. మరియు ఆయన సుబహానహు వతఆలా మీ శతృవులను వినాశనము చేసి,మిమ్మల్ని భూమండలంలో ప్రతినిధులుగా చేసి,అందులో మీకు అధికారమును ప్రసాదించి మీపై అనుగ్రహాలను ప్రసాదించి మీ కాలములో మిమ్మల్ని సమస్తలోక వాసులపై ప్రాధాన్యతను ఇచ్చినాడు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి