సూరా 7 · జుజ్ 9
Al-A'raf · 7:133
فَأَرْسَلْنَا عَلَيْهِمُ الطُّوفَانَ وَالْجَرَادَ وَالْقُمَّلَ وَالضَّفَادِعَ وَالدَّمَ آيَاتٍ مُفَصَّلَاتٍ فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا مُجْرِمِينَ
కావున మేము వారిపై జలప్రళయం (తూఫాన్), మిడుతల దండు, పేనులు, కప్పలు మరియు రక్తం మొదలైన స్పష్టమైన సూచనలను పంపాము. అయినా వారు దురహంకారం చూపారు ఎందుకంటే వారు మహా అపరాధులై ఉండిరి.
తఫ్సీర్
మేము వారి తిరస్కారము,వారి వ్యతిరేకత వలన వారికి శిక్షగా వారిపై ఎక్కువగా నీటిని కురిపించాము. అది వారి పంటలను,ఫలాలను ముంచివేసింది. మరియు మేము వారిపై మిడతలను పంపాము. అవి వారి చేతికి వచ్చిన పంటను తినివేశాయి. మరియు మేము వారిపై పేలు అని పిలవబడే పురుగులను పంపాము. అవి పంటను నాశనంచేస్తాయి లేదా మనిషి జుట్టులో బాధను కలిగిస్తాయి. మరియు మేము వారిపై కప్పలను పంపాము. అవి వారి పాత్రలను నింపివేశాయి,వారి ఆహారపదార్దాలను పాడుచేశాయి. వారి పడకలపై పడుకున్నాయి. మరియు మేము వారిపై రక్తమును పంపాము. అది వారి నూతుల,కాలువల నీళ్ళని రక్తంగా మర్చివేసింది. వీటన్నింటిని మేము స్పష్టమైన వేరు వేరు మహిమలుగ ఒకదాని వెనుక ఒకటిగా పంపించాము. ఇవన్ని శిక్షలు వారిపై వచ్చినప్పటికి వారు అల్లాహ్ పై విశ్వాసము నుండి,మూసా తీసుకుని వచ్చిన దాన్ని నిజమని అంగీకరించటం నుండి అహంకారమును చూపారు. వారు పాపాలకు పాల్పడేవారు. అసత్యాన్ని విడనాడరు,సత్యం వైపునకు మార్గం పొందరు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి