సూరా 7 · జుజ్ 8

Al-A'raf · 7:11

وَلَقَدْ خَلَقْنَاكُمْ ثُمَّ صَوَّرْنَاكُمْ ثُمَّ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ لَمْ يَكُنْ مِنَ السَّاجِدِينَ

మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని సృష్టించాము. పిదప మీ రూపాన్ని తీర్చిదిద్దాము. ఆ పిదప దైవదూతలను: "మీరు ఆదమ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి!" అని ఆదేశించగా, ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగం (సజ్దా) చేశారు, అతడు సాష్టాంగం చేసేవారిలో చేరలేదు.

తఫ్సీర్

ఓ ప్రజలారా మీ తండ్రి అయిన ఆదం ను మేము సృష్టించినాము. ఆ పిదప ఆయనకు అందమైన రూపమును ప్రసాధించినాము.ఉత్తమమైన రీతిలో తీర్చి దిద్దాము. ఆ పిదప మేము దైవదూతలను ఆయనకు గౌరవంగా సాష్టాంగపడమని ఆదేశించినాము.అయితే వారు ఆదేశాన్ని పాటించి సాష్టాంగ పడ్డారు. కాని ఇబ్లీస్ గర్వం వలన ,వ్యతిరేకత వలన సాష్టాంగపడటం నుండి నిరాకరించాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి