సూరా 62 · జుజ్ 28

Al-Jumu'ah · 62:1

يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ الْمَلِكِ الْقُدُّوسِ الْعَزِيزِ الْحَكِيمِ

ఆకాశాలలో నున్నవి మరియు భూమిలో నున్నవి, సమస్తమూ విశ్వసార్వభౌముడు, పరమ పవిత్రుడు, సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అయన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి.

తఫ్సీర్

ఆకాశములలో ఉన్నవన్ని మరియు భూమిలో ఉన్నవన్ని సృష్టితాలు అల్లాహ్ కు తగని లోపములు ఉన్న గుణాల నుండి పరిశుద్ధతను కొనియాడుతున్నవి మరియు ఆయన అతీతను తెలుపుతున్నవి. ఆయన ఒక్కడే రాజ్యమును ఏలే ఏకైక రాజాది రాజు, ప్రతీ లోపము నుండి పరిశుద్ధుడు. ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన సృష్టించటంలో మరియు తన ధర్మ శాసనంలో మరియు తన విధి వ్రాతలో వివేకవంతుడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి

Al-Jumu'ah 62:1 · Tlawati