సూరా 6 · జుజ్ 7

Al-An'am · 6:63

قُلْ مَنْ يُنَجِّيكُمْ مِنْ ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ تَدْعُونَهُ تَضَرُّعًا وَخُفْيَةً لَئِنْ أَنْجَانَا مِنْ هَٰذِهِ لَنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ

" 'మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేమెంతో కృతజ్ఞులమవుతాము.' అని మీరు వినమ్రులై రహస్యంగా వేడుకున్నప్పుడు! భూమి మరియు సముద్రాల చీకట్ల నుండి మిమ్మల్ని కాపాడేదెవరు? అని వారిని అడుగు.

తఫ్సీర్

ఓ ప్రవక్త ఈ ముష్రికులందరితో తెలియపరచండి : భూమిలోని,సముద్రములోని చీకట్లలో మీపై వచ్చిపడే వినాశముల నుండి మిమ్మల్ని పరిరక్షించే వాడు,విముక్తిని కలిగించేవాడు ఎవడు?.ఏ ఒక్కడినైతే మీరు కడు ధీనంగా,వినయంగా బహిర్గంగా,లోలోపల ఇలా వేడుకుంటున్నారు : మా ప్రభువు ఈ వినాశనములనుండి ఒక వేళ మమ్మల్ని రక్షిస్తే మేము వేరేవారిని కాకుండా ఆయననే ఆరాధించి ఆయన మాపై ప్రసాధించిన అనుగ్రహాలకు తప్పకుండా కృతజ్ఞతలు తెలుపుకుంటాము.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి