సూరా 6 · జుజ్ 7
Al-An'am · 6:61
وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهِ ۖ وَيُرْسِلُ عَلَيْكُمْ حَفَظَةً حَتَّىٰ إِذَا جَاءَ أَحَدَكُمُ الْمَوْتُ تَوَفَّتْهُ رُسُلُنَا وَهُمْ لَا يُفَرِّطُونَ
ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మీపై కనిపెట్టుకొని ఉండే వారిని పంపుతాడు. చివరకు మీలో ఒకరికి చావు సమయం వచ్చినపుడు, మేము పంపిన దూతలు అతనిని మరణింపజేస్తారు మరియు వారెప్పుడూ అశ్రద్ధ చూపరు.
తఫ్సీర్
మరియు అల్లాహ్ తన దాసులపై ఆదిపత్యం చలాయించే వాడును,వారిని ఆదీనంలో చేసుకునేవాడును.అన్ని విధాలుగా వారిపై ఆదిపత్యాన్ని చలాయించేవాడు.ప్రతీది ఆయనకు విధేయత చూపుతుంది.ఆయనకు తన దాసులపై ఏవిధంగా ఆదిపత్యం ఉండటం వర్తిస్తుందో ఆ విధమైన ఆదిపత్యం ఉన్నది. ఓ మానవులారా ఆయన మీపై గౌరవోన్నతులైన దూతలను మీ ఆచరణలను షుమారు చేయటానికి,లెక్కవేయటానికి పంపిస్తాడు.చివరికి మీలో ఎవరిదైన ఆయుషు ముగిస్తుంది.మరణదూత,ఆయన సహాయకులు అతని ఆత్మను స్వాధీనపరచుకుంటారు.వారు తమకు ఇవ్వబడిన ఆదేశంలో ఎటువంటి నిర్లక్షం వహించరు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి