సూరా 6 · జుజ్ 7

Al-An'am · 6:59

۞ وَعِنْدَهُ مَفَاتِحُ الْغَيْبِ لَا يَعْلَمُهَا إِلَّا هُوَ ۚ وَيَعْلَمُ مَا فِي الْبَرِّ وَالْبَحْرِ ۚ وَمَا تَسْقُطُ مِنْ وَرَقَةٍ إِلَّا يَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِي ظُلُمَاتِ الْأَرْضِ وَلَا رَطْبٍ وَلَا يَابِسٍ إِلَّا فِي كِتَابٍ مُبِينٍ

మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కానీ ఎండినది కానీ అంతా స్పష్టంగా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.

తఫ్సీర్

ఒక్కడైన అల్లాహ్ వద్ద అగోచరాల నిధులు ఉన్నవి. వాటి గురించి అల్లాహ్ కు తప్ప ఇతరులకు తెలియదు. భూమిలో ఉన్న సృష్టితాలైన జంతువుల్లోంచి,మొక్కల్లోంచి,స్థిరరాసుల్లోంచి ప్రతి ఒక్కరి గురించి ఆయనకు తెలుసు. సముద్రంలో ఉన్న జంతువుల గురించి మొక్కల గురించి ఆయనకు తెలుసు. భూమిలో పాతిపెట్టబడిన ప్రతీ గింజ అది పచ్చిదైన,ఎండినదైన ఒక స్పష్టమైన గ్రంధంలో నమోదై ఉన్నది. అది లౌహె మహ్ఫూజ్ గ్రంధం.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి