సూరా 6 · జుజ్ 7

Al-An'am · 6:56

قُلْ إِنِّي نُهِيتُ أَنْ أَعْبُدَ الَّذِينَ تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ ۚ قُلْ لَا أَتَّبِعُ أَهْوَاءَكُمْ ۙ قَدْ ضَلَلْتُ إِذًا وَمَا أَنَا مِنَ الْمُهْتَدِينَ

ఇలా అను: "నిశ్చయంగా అల్లాహ్ ను వదిలి, మీరు ప్రార్థించే ఈ ఇతరులను (కల్పిత దైవాలను) ఆరాధించటం నుండి నేను వారించబడ్డాను." మరియు ఇలా అను: "నేను మీ కోరికలను అనుసరించను. (అలా చేస్తే!) వాస్తవానికి నేనూ మార్గభ్రష్టుడను అవుతాను. మరియు నేను సన్మార్గం చూపబడిన వారిలో ఉండను."

తఫ్సీర్

ఓ ప్రవక్తా మీరు తెలియపరచండి : నిశ్చయంగా మీరు అల్లాహ్ ను వదిలి వేటినైతే ఆరాధిస్తున్నారో వాటి ఆరాధన చేయటం నుండి అల్లాహ్ నన్ను వారించాడు.ఓ ప్రవక్తా మీరు తెలియపరచండి : అల్లాహ్ ను వదిలి ఇతరుల ఆరాధన విషయంలో నేను మీ కోరికలను అనుసరించను.ఒకవేళ ఆ విషయంలో మీ కోరికలను అనుసరిస్తే నేను సత్యమార్గము నుండి తప్పిపోతాను.దాని వైపున మార్గమును పొందలేను.అల్లాహ్ నిదర్శనమును వదిలి కోరికలను అనుసరించే ప్రతి ఒక్కరి పరిస్థితి ఇది.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి