సూరా 6 · జుజ్ 7

Al-An'am · 6:54

وَإِذَا جَاءَكَ الَّذِينَ يُؤْمِنُونَ بِآيَاتِنَا فَقُلْ سَلَامٌ عَلَيْكُمْ ۖ كَتَبَ رَبُّكُمْ عَلَىٰ نَفْسِهِ الرَّحْمَةَ ۖ أَنَّهُ مَنْ عَمِلَ مِنْكُمْ سُوءًا بِجَهَالَةٍ ثُمَّ تَابَ مِنْ بَعْدِهِ وَأَصْلَحَ فَأَنَّهُ غَفُورٌ رَحِيمٌ

మరియు మా సూచనలను విశ్వసించిన వారు నీ వద్దకు వచ్చినపుడు నీవు వారితో ఇలా అను: "మీకు శాంతి కలుగు గాక (సలాం)! మీ ప్రభువు కరుణించటమే తనపై విధిగా నిర్ణయించుకున్నాడు. నిశ్చయంగా, మీలో ఎవరైనా అజ్ఞానం వల్ల తప్పు చేసి, ఆ తరువాత పశ్చాత్తాప పడి, సరిదిద్దుకుంటే! నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

తఫ్సీర్

ఓ ప్రవక్తా మీరు తీసుకుని వచ్చినది సత్యం కావటంపై సాక్షమిచ్చే మా సూచనలపై విశ్వాసం కలిగినవారు మీ వద్దకు వచ్చినప్పుడు వారిని గౌరవంగా మీరు సలాం చేయండి.అల్లాహ్ యొక్క సువిశాల కారుణ్యం గురించి వారికి శుభవార్తనివ్వండి.అల్లాహ్ దయ చూపటంను కరుణాకరమైన విధిగా విధిగావించుకున్నాడు.మీలోనుంచి ఎవరైన అవివేకంగా,అజ్ఞానంగా పాపమునకు పాల్పడి ఆ తరువాత పశ్చాత్తాపం చెందితే,తన కార్యమును సరిదిద్దుకుంటే నిశ్చయంగా అల్లాహ్ అతను చేసిన పాపమును క్షమించివేస్తాడు.అల్లాహ్ తన దాశుల్లోంచి మన్నింపుని కోరేవారిని క్షమించేవాడు,వారిపై కనికరించేవాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి