సూరా 6 · జుజ్ 7

Al-An'am · 6:48

وَمَا نُرْسِلُ الْمُرْسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنْذِرِينَ ۖ فَمَنْ آمَنَ وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ

మరియు మేము ప్రవక్తలను కేవలం శుభవార్తలు ఇచ్చేవారుగా మరియు హెచ్చరికలు చేసే వారుగా మాత్రమే పంపుతాము. కావున ఎవరైతే విశ్వసించి (తమ నడవడికను) సరిదిద్దుకుంటారో, అలాంటి వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖ పడరు కూడా!

తఫ్సీర్

మేము ప్రవక్తలను పంపించినది విశ్వాసపరులకి,విధేయత చూపేవారికి వారి కొరకు ఏర్పాటు చేసిన అంతం కాని,సమాప్తమవని శాస్వతమైన అనుగ్రహాల గురించి సందేశమివ్వటం కొరకు,అవిశ్వాసపరులని,అవిధేయతపరులని మన కఠినమైన శిక్ష నుండి భయపెట్టటానికి మాత్రమే.ఎవరైతే ప్రవక్తలపై విశ్వాసమును చూపుతారో,తమ కార్యాలను సరిదిద్దుకుంటారో తమ అంతిమ దినమున ఏదైతే వారు ఎదుర్కొంటారో దాని గురించి వారికి ఎటువంటి భయముండదు,ఇహలోక తమ భాగములను ఏవైతే వారు కోల్పోయారో వాటి గురించి వారికి ఎటువంటి దుఃఖముగాని చింతనగాని ఉండదు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి