సూరా 6 · జుజ్ 8
Al-An'am · 6:165
وَهُوَ الَّذِي جَعَلَكُمْ خَلَائِفَ الْأَرْضِ وَرَفَعَ بَعْضَكُمْ فَوْقَ بَعْضٍ دَرَجَاتٍ لِيَبْلُوَكُمْ فِي مَا آتَاكُمْ ۗ إِنَّ رَبَّكَ سَرِيعُ الْعِقَابِ وَإِنَّهُ لَغَفُورٌ رَحِيمٌ
మరియు ఆయనే మిమ్మల్ని భూమి మీద ఉత్తరాధికారులుగా నియమించి - మీకిచ్చిన దానితో మిమ్మల్ని పరీక్షించటానికి - మీలో కొందరికి మరికొందరిపై ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష విధించటంలో అతి శీఘ్రుడు, మరియు నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
తఫ్సీర్
మరియు అల్లాహ్ నే భూ నిర్మాణము కొరకు (ఆబాద్ చేయటం కొరకు) మీ పూర్వీకుల తరువాత మిమ్మల్ని సృష్టించాడు. సృష్టి,ఆహారోపాధి విషయంలో ,అవే కాకుండా వేరే వాటి విషయంలో మీకు ప్రసాధించిన వాటి విషయంలో మిమ్మల్ని పరీక్షించటం కొరకు మీలో కొందరిని కొందరిపై స్థానాలను పెంపొందించాడు. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు శీఝ్రంగా శిక్షించే వాడు. వచ్చేది ప్రతీది కూడా దగ్గరవుతుంది. మరియు నిశ్చయంగా ఆయన తన దాసుల్లోంచి క్షమాపణ కోరే వాడిని మన్నించే వాడును,కరుణించే వాడును.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి