సూరా 6 · జుజ్ 8

Al-An'am · 6:125

فَمَنْ يُرِدِ اللَّهُ أَنْ يَهْدِيَهُ يَشْرَحْ صَدْرَهُ لِلْإِسْلَامِ ۖ وَمَنْ يُرِدْ أَنْ يُضِلَّهُ يَجْعَلْ صَدْرَهُ ضَيِّقًا حَرَجًا كَأَنَّمَا يَصَّعَّدُ فِي السَّمَاءِ ۚ كَذَٰلِكَ يَجْعَلُ اللَّهُ الرِّجْسَ عَلَى الَّذِينَ لَا يُؤْمِنُونَ

కావున అల్లాహ్ సన్మార్గం చూపదలచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు తెరుస్తాడు. మరియు ఎవరిని ఆయన మార్గభ్రష్టత్వంలో వదలగోరుతాడో అతని హృదయాన్ని (ఇస్లాం కొరకు) - ఆకాశం పైకి ఎక్కేవాని వలే - బిగుతుగా అణచివేయబడినట్లు చేస్తాడు. ఈ విధంగా, అల్లాహ్! విశ్వసించని వారిపై మాలిన్యాన్ని రుద్దుతాడు.

తఫ్సీర్

అల్లాహ్ ఎవరికైన సన్మార్గము ప్రసాధించదలచుకుంటే అతని హృదయమును విశాలంగా చేస్తాడు,ఇస్లాం స్వీకరించటానికి అతన్ని సిద్ధం చేస్తాడు. మరియు ఎవరినైన ఆయన నిస్సహాయుడిగా వదిలివేయాలని,సన్మార్గం పొందే సౌభాగ్యం కలగకుండా చేయాలి అనుకుంటే అతని హృదయమును సత్యమును స్వీకరించటం నుండి కుదింపజేస్తాడు. ఆకాశము వైపునకు ఎక్కటం అతనికి సాధ్యం కాని విధంగా సత్యం అతని హృదయంలో ప్రవేశించటం నుండి ఆగిపోతుంది. మరియు అదేవిధంగా అల్లాహ్ మార్గభ్రష్టుని స్థితిని కఠినంగా బిగుతుగా ఉన్న ఈ స్థితికి గురి చేస్తాడు. ఆయనను విశ్వసించని వారిపై శిక్షను కురిపిస్తాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి